Karni Sena Warns Vandalize If Padmaavat Screens | పద్మావత్ రిలీజ్.. మిగిలింది థియేటర్ల విధ్వంసమే!

Rajput karni warns padmaavat screening

Karni Sena, Sanjay Leela Bhansali, Padmaavat, Supreme Court, Lokendra Singh, Karni Sena Warn Padmaavat, Padmaavat Theaters, Padmaavat Ban, Padmaavat

Karni Sena, the fringe group that has been at the forefront of protests against Sanjay Leela Bhansali's film, Padmaavat, has refused to back down after the Supreme Court told states that they could not ban the movie on grounds of risk to public order. Its leader, Lokendra Singh, asked social organisations across the country to make sure that the movie is not shown in cinema halls.

పద్మావత్ థియేటర్లను తగలబెడతాం : కర్ణిసేన

Posted: 01/18/2018 05:58 PM IST
Rajput karni warns padmaavat screening

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చిత్రం విడుదలకు సుప్రీం కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన వేళ.. పద్మావత్ కు మరో డెడ్లీ వార్నింగ్ వచ్చి పడింది. రాజ్‌పుత్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున్న ఆందోళనకు సిద్ధం అయ్యాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేస్తే సహించేది లేదని స్పష్టం చేశాయి.

తమ విన్నతులను పట్టించుకోకుండా ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నామని ఆయా సంఘాల ప్రతినిధులు అన్నారు. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారని రాజ్‌పుత్‌లు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డు క్లియరెన్స్, తర్వాత పలు రాష్ట్రాలు చిత్రాన్ని విడుదల కానీవ్వబోమని ప్రకటించాయి. అయితే బండిట్ క్వీన్ లాంటి చిత్ర విడుదలకు అనుమతించినప్పుడు.. దీనిని ఎలా అడ్డుకుంటారంటూ సుప్రీం కోర్టు ఆందోళన కారులను నిలదీసింది.

ఆపై తర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే రాజ్‌పుత్‌లు ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే ప్రధాన పాత్ర్లల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. జనవరి 25న పద్మావత్ విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles