No Item Song in Mahesh Babu BAN | మెసేజ్ ఓరియంటల్ సినిమా.. ఐటెం సాంగ్ ఎందుకు?

Mahesh babu says no to item song

Bharat Anu Nenu, Mahesh Babu, Special Song, Devi Sri Prasad, Mahesh Babu BAN

Mahesh Babu Says No to Item Song in Bharat Ane Nenu. Koratala Siva plans energetic song but social message concept Mahesh says no Koratala.

ఐటెం సాంగ్ కి నో చెప్పిన మహేష్ బాబు

Posted: 01/18/2018 05:13 PM IST
Mahesh babu says no to item song

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా రెండు పాటలు .. ఫైట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా స్టార్ సినిమాల చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయాయి.

ఈ నేపథ్యంలో భరత్ అను నేనులో కూడా ఐటెం సాంగ్ కోసం కొరటాల యత్నించాడంట. అయితే అందుకు మహేష్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యావ్యవస్థకు సంబంధించి కథనంతో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో ఐటమ్ సాంగ్ గానీ .. ప్రత్యేక గీతాల్లాంటివి గాని ఉండటానికి వీల్లేదని కొరటాలతో మహేశ్ బాబు తేల్చి చెప్పారట. ఇది సందేశాత్మక చిత్రం కావడం వలన, ఇలాంటివి పక్కన పెట్టేయడమే మంచిదని సూచించారట.

కథా నేపథ్యం కారణంగా కూడా ఇలాంటివి అడ్డుపడతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో కొరటాల కూడా మహేశ్ సూచనకి ఓకే చెప్పేశారట. అందువలన ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండే అవకాశాలు లేవు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 26వ తేదీన ఫస్ట్ లుక్ ను వదలనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles