Agnyaathavaasi Not Effected on NTR-Trivikram Movie | అజ్ఞాతవాసి ప్రభావం లేకుండానే ఎన్టీఆర్ చిత్రం

Agnyaathavaasi ntr movie

NTR, Trivikram, NTR New Look, NTR Trivikram Movie, NTR Agnyaathavaasi Effect

NTR Taken Caring about Trivikram Movie after Agnyaathavaasi Debacle. NTR suggest some changes in story and make over for Trivikram Movie.

ఎన్టీఆర్ చిత్రంపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్

Posted: 01/12/2018 06:32 PM IST
Agnyaathavaasi ntr movie

జై లవ కుశ సినిమా తర్వాత త్రివిక్రమ్ తోనే తన నెక్స్ట్ చిత్రాన్ని ఫ్లాన్ చేసుకున్నాడు దర్శకుడు ఎన్టీఆర్. పవన్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో అజ్నాతవాసి ఫలితంతో ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డానే టాక్ ఒకటి బయలుదేరింది. అయితే ఆ వార్తలను ఖండిస్తూ త్వరలో ఎన్టీఆర్ షూటింగ్ కు రెడీ అయిపోతున్నాడు.

ఇక సినిమా కోసం ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన చాలా వరకూ బరువు తగ్గాలని త్రివిక్రమ్ చెప్పారనీ .. అప్పటి నుంచి ఎన్టీఆర్ కసరత్తు మొదలెట్టాడని చెప్పుకున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ ఫారిన్ నిపుణుడి పర్యవేక్షణలో ఎన్టీఆర్ కసరత్తు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ను చూసినవాళ్లు 'ఇంతలోనే ఇంత మార్పా?' అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారట. ఎన్టీఆర్ అంతగా సన్నబడిపోయాడని అంటున్నారు.

త్రివిక్రమ్ ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడన్నమాట. మరోవైపు ఎన్టీఆర్ సూచనల మేరకు పక్కా స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ సిద్ధం చేసుకుంటున్నాడని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles