RGV Ready to Sensation with Porn Star Video | వర్మ అరాచకం.. పోర్న్ స్టార్ తో ఏకంగా వీడియో

Rgv directed porn star

Ram Gopal Varma, Porn Star Mia Malkova, Mia Malkova RGV, Mia Malkova Varma, GOD SEX and TRUTH, RGV Porn Video

Director Ram Gopal Varma Finally directed Porn Star. Varma in serial tweets thanks to actress Mia Malkova for Video Shoot.

పోర్న్ స్టార్ తో రామ్ గోపాల్ వర్మ

Posted: 01/11/2018 04:15 PM IST
Rgv directed porn star

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈ మధ్య బోల్డ్ కంటెంట్ పై బాగా దృష్టిసారిస్తున్నాడు. ఆ మధ్య వెబ్ సిరీస్ పేరిట ఓ న్యూడ్ ట్రైలర్ ను వదిలిన వర్మ.. తర్వాత కడపలో కాస్త ఘాటు మసాలానే యాడ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా పోర్న్ హీరోయిన్ తోనే ఓ వీడియో తీసి త్వరలో సంచలనానికి సిద్ధమైపోయాడు.

పోర్న్ చిత్రాల్లో నటించే మియా మల్కోవా తో ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ పేరిట వర్మ ఓ వీడియోను చిత్రీకరించాడు. పైగా ఆ విషయాన్ని తన ట్విటర్ లో పోస్టు చేశాడు. ‘‘సన్నీ లియోన్‌ను డైరెక్ట్ అవకాశం నాకు దక్కలేదు. కానీ, మియా.. మీతో చేసిన ఈ అనుభవాన్ని మాత్రం మరువలేను. మీకు నా కృతజ్ఞతలు అంటూ వరుస ట్వీట్లు చేశాడు. ‘‘నువ్వో అందమైన పెయింటింగ్‌.. నేనో ఫ్రేమ్‌ మేకర్‌’’ అంటూ తనదైన శైలిలో ఫోటో ఒకదానిని ఉంచాడు. ఇక వర్మ డైరెక్షన్‌లో నటించిన విషయాన్ని మియా కూడా కన్ఫర్మ్ చేసేసింది.

యూరప్‌లో గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ షూటింగ్‌ జరిగిందని.. ఇండియన్‌ తెరపై సన్నీ లియోన్‌ తర్వాత కనిపించబోయే శృంగార తారను తానేనంటూ ఆమె పేర్కొంటూ వీడియోకు సంబంధించిన కొన్ని నగ్న ఫోటోలను ఆమె పోస్టు చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ ను జనవరి 16న విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. మొత్తానికి పోర్న్ స్టార్ ను డైరెక్ట్ చేయాలన్న కలను ఎలాగైతేనేం వర్మ నెరవేర్చుకున్నాడు. ఇక మిగిలింది ఆ ట్రైలర్ ద్వారా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడన్నదే!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Porn Star  ఆర్జీవీ  పోర్న్ స్టార్  

Other Articles