Prabhas Clear Rumours on Anushka and Marriage | అనుష్క, పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పెట్టేసిన ప్రభాస్

Prabhas clear rumours on marriage

Actor Prabhas, GQ Interview, Anushka Rumours, Prabhas GQ Interview, Prabhas Marriage

Prabhas Clear Rumours on Marriage and affair with Anushka. Says in 2018 also he not get marriage clarify on GQ Interview.

నా పెళ్లి ఈ ఏడాది కూడా లేదు : ప్రభాస్

Posted: 01/03/2018 01:28 PM IST
Prabhas clear rumours on marriage

బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ ఇటీవల జీక్యూ మాగ్జైన్ పై మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సంచిక ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ప్రధానంగా గత మూడు, నాలుగు నెలలుగా వినిపిస్తున్న వార్తల గురించి పుల్ స్టాప్ పెట్టేలా క్లారిటీ ఇచ్చాడు.

‘‘నాకు అనుష్కకు పెళ్లి జరగబోతోందని కొన్ని మీడియా ఛానల్స్, వెబ్ సైట్స్ లో చూశాను. అలాంటి పుకార్లు ఎలా ప్రచారం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. నేను, అనుష్క గొప్ప స్నేహితులమే.. కానీ, పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’’ అని కుండ బద్దలు కొట్టేసాడు. ఒక జంట వరసగా సినిమాల్లో నటించి బయట సన్నిహితంగా మెలిగినప్పుడు ఇలాంటి ప్రచారం జరగడం సహజమన్న ప్రభాస్ ఈ సంవత్సరం చిత్రాలతోనే గడిపేస్తానని.. ఇప్పట్లో తన పెళ్లి ఉండబోదని తేల్చేశాడు. మరి ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్నకు... లేని గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడి నుంచి తెమ్మంటారు అని ప్రభాస్ బదులిచ్చాడు.

ఇక సాహో తర్వాత బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. దుబాయ్ షెడ్యూల్ డిలేకు అనుమతి దొరక్కపోవటమే కారణమని తేల్చేశాడు. మాస్టర్ కెన్ని బేట్స్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ రొమాంఛితంగా ఉంటాయని చెప్పేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles