TFPC versus digital service providers Reached Peaks | తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ కు తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ పిలుపు

Tfpc versus digital service providers in tollywood

Telugu Film Producers Council(TFPC), Digital Service Providers, Theatres Bandh, TFPC Theaters, TFPC DSP

Telugu Film Producers Council (TFPC) versus digital service providers: Theatres in Telugu states to shut down from March 2018. The announcement has caused panic in the industry as several Telugu biggies including Mahesh Babu’s Bharath Ane Nenu and Allu Arjun’s Naa Peru Surya are scheduled to release in April next year.

థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చిన టీఎఫ్‌సీసీ

Posted: 12/16/2017 06:22 PM IST
Tfpc versus digital service providers in tollywood

మార్చి 2018 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల బంద్ పాటించ‌నున్న‌ట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌క‌టించింది. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు (డీఎస్‌పీ) విధిస్తున్న అధిక ఛార్జీల‌కు నిర‌స‌న‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ ప్ర‌క‌ట‌నతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కొత్త ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌తో స‌మ‌స్యపై టీఎఫ్‌సీసీ ఎప్ప‌టినుంచో వ్య‌తిరేక‌త చెబుతోంది... అయితే ఈసారి మాత్రం ఛార్జీలు త‌గ్గించే వ‌ర‌కు స‌మ్మె చేస్తామ‌ని టీఎఫ్‌సీసీ అధ్య‌క్షుడు పి. కిర‌ణ్ తెలిపారు. ప్ర‌స్తుతం ఒక సినిమా డిజిట‌ల్ ప్ర‌ద‌ర్శ‌న కోసం డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు వారానికి రూ. 20,000లు చెల్లిస్తున్న‌ట్లు టీఎఫ్‌సీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ముత్యాల రామదాస్ వెల్ల‌డించారు. 'డీఎస్‌పీలు త‌మ ప‌రిక‌రాల‌ను ఎగ్జిబిట‌ర్‌కి అంద‌జేస్తున్న కార‌ణంగా ఈ ఛార్జీల‌ను ఎగ్జిబిట‌ర్ గానీ, డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ గానీ భ‌రించాలి. కానీ వీటిని డిస్ట్రిబ్యూట‌ర్ల మీద రుద్ద‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం' అని రామ‌దాస్ ప్ర‌శ్నించారు.

టీఎఫ్‌సీసీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌తో మార్చి త‌ర్వాత విడుద‌లకు సిద్ధం చేసిన సినిమాల నిర్మాత‌లు గాబ‌రా ప‌డుతున్నారు. ఏప్రిల్‌లో మ‌హేశ్ బాబు 'భ‌ర‌త్ అనే నేను', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రాలు విడుద‌ల‌కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా మేకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles