Agnyaathavaasi Movie Official Teaser Released | అజ్ఞాతవాసి టీజర్ రిలీజ్ అయ్యింది.. యూట్యూబ్ షేక్ అవుతోంది

Agnyaathavaasi teaser out

Pawan Kalyan, Agnyaathavaasi, Agnyaathavaasi Teaser, PSPK 25, PK Creative Works, Trivikram Srinivas, Anirudh Ravichander, Keerthy Suresh, Anu Emmanuel khushboo, Haarika & Hassine Creations

Pawan Kalyan 25th Movie Agnyaathavaasi Official Teaser Released. Stylish Power Star is Back.

అజ్ఞాతవాసి అఫీషియల్ టీజర్ విడుదల

Posted: 12/16/2017 05:57 PM IST
Agnyaathavaasi teaser out

పవర్ స్టార్ అభిమానులు బిగపట్టుకుని చూస్తున్న క్షణాలు వచ్చేశాయి. హిట్ కాంబినేషన్ పవన్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అజ్ఞాతవాసి’ టీజర్‌ విడుదలకు విడుదలయ్యింది. చెప్పిన సమయానికి ముందే టీజర్ ను విడుదల చేసేశారు. ఇలా అయ్యిందో లేదో అలా రికార్డులు బద్ధలు కొట్టడం ప్రారంభించింది. ఒక్క సారిగా అభిమానులు టీజర్ కోసం ఎగబడిపోవటం విశేషం.

టీజర్ లో స్టైలిష్ గా ఉన్న పవన్ లుక్కు ఆకట్టుకుంది. బ్యాగ్రౌండ్ లో కృష్ణ శ్లోకం.. కలర్ ఫుల్ గా రిచ్ ను నింపేశారు. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని అంశాలతో టీజర్ ను నింపేసినట్లు అర్థమౌతోంది. చివర్లో పవన్ ను ఉద్దేశించి వీడి చర్యలు ఊహాతీతం వర్మ అని మురళి శర్మ చెప్పటం.. దట్స్ ద బ్యూటీ అని రావు రమేష్ చెప్పటం గమనించవచ్చు.  

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీఎస్‌పీకే 25 మూవీ ‘అజ్ఞాతవాసి’ 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంతకు ముందు పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, పవన్ అను ఒకరినొకరు చూస్తూ పరవశిస్తున్న పోస్టర్లను విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘అజ్ఞాతవాసి’ టీజర్‌ కోసం అటు మెగా అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక విడుదలకు ముందే ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో ఈ సాయంత్రం విడుదలయ్యే టీజర్ ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేకింగ్ టీజర్ అవుతుందంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles