Female actresses attending the Globes in Black Dress | లైంగిక వేధింపులు.. నల్ల డ్రెస్సులతో హీరోయిన్ల నిరసన

Hollywood actresses black gown protest at globes awards

Hollywood, Golden Globes, Me Too, Golden Globes Red Carpet, Hollywood Actresses, Meryl Streep, Jessica Chastain, Harvey Weinstein

The women of Hollywood will wear black at Golden Globes to protest against sexual harassment from Meryl Streep to Jessica Chastain, Hollywood hotshots are planning a red carpet protest.

నల్ల డ్రెస్సులతో నటీమణుల నిరసన

Posted: 12/16/2017 04:50 PM IST
Hollywood actresses black gown protest at globes awards

హాలీవుడ్ మొఘల్ హర్వే వెయిస్టెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీటూ ఉద్యమం నడవటం.. దాని ద్వారా పలువురి బండారాలు వెలుగులోకి రావటం చూశాం. ఈ క్రమంలో వారు గళమెత్తటం మానేసి మౌనంగానే మొత్తం చేసుకుంటూ పోతున్నారు. ఇక ఇప్పుడుమూకుమ్మడిగా వారంతా ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డుల రెడ్ కార్పెట్ వేడుకకు న‌లుపు రంగు దుస్తుల్లో హాజ‌రుకావటం ఆసక్తికరంగా మారింది.

వీన్‌స్టెన్ లైంగిక వేధింపుల వివాదం, మీ టూ ఉద్య‌మంతో పాటు పారితోషికం విష‌యంలో లింగ‌భేదం వంటి స‌మ‌స్య‌లకు నిర‌స‌న‌గా వారంతా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌ముఖ మేగ‌జైన్ `హాలీవుడ్ రిపోర్ట‌ర్‌` త‌న క‌థ‌నంలో పేర్కొంది. జ‌న‌వ‌రి 7న ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జ‌ర‌గ‌నుంది.

అలాగే జ‌న‌వ‌రి 21న జ‌ర‌గ‌నున్న స్క్రీన్ యాక్ట‌ర్స్ గిల్డ్ అవార్డుల వేడుక‌లో అవార్డు అంద‌జేసే వారంద‌రూ మ‌హిళ‌ల‌నే ప్ర‌క‌టించిన త‌ర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా ప్ర‌త్యేక‌త కోసం ఈ ర‌క‌మైన ఆలోచ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. గత వారం టైమ్ మ్యాగ్జైన్ కూడా మీటూ ఉద్యమం నడిపిన ది సైలెన్స్ బ్రేకర్స్ ను టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతోపాటు కవర్ పేజీపై కూడా ఫోటోను ప్రచురించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles