Sekhar Kammula Fidaa 2 with Vijay Devarakonda | లీడర్ 2 లైట్.. ఫిదా 2 కి ఫ్లాన్?

Sekhar kammula next with vijay devarakonda

Sekhar Kammula, Dil Raju, Vijay Devarakonda, Fidaa 2, Leader 2, Rana Daggubati, Sekhar Kammula Next

Sekhar Kammula was given another opportunity in Dil Raju production. Talented youngster Vijay Devarakonda has been approached for the lead role and the actor is said to have agreed to be a part of the film but added that he would do the film after finishing his ongoing projects. It looks like he is going to come up with another love story with Telangana as a backdrop.

రానాతోకాదు విజయ్ దేవరకొండతో కమ్ముల

Posted: 12/14/2017 06:14 PM IST
Sekhar kammula next with vijay devarakonda

క్లాస్ టేకింగ్ అండ్ యాక్టర్ల ఫెర్ ఫార్మెన్స్ తో శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 'ఫిదా' సినిమాతో మరోసారి ఆయన యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఆయన తదుపరి సినిమా విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన నెక్స్ట్ మూవీ హీరోలుగా రానా .. నాని .. శర్వానంద్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎప్పటి నుంచో అనుకుంటున్న లీడర్ 2 చిత్రాన్నే తెరకెక్కించబోతున్నాడంటూ గత కొంత కాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే రీసెంట్ గా ఆయన విజయ్ దేవరకొండను కలిసి ఒక లైన్ వినిపించాడట. ఆ లైన్ విజయ్ కి నచ్చడంతో, ఆ కథను డెవలప్ చేయమని చెప్పినట్టుగా సమాచారం.

ప్రస్తుతం విజయ్ ఆల్రెడీ పరశురామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. వరుసగా క్రాంతిమాధవ్, నందినీ రెడ్డి, రాహుల్ డైరెక్షన్ లలో కమిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయనతో శేఖర్ కమ్ముల సినిమా చేయడం నిజమే అయితే, ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకూ ఆగుతాడా? లేదా కమ్ముల సినిమాకే ముందుకు వెళ్తాడా?. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఒకే అయితే నిర్మాతగా వ్యవహరించేందుకు దిల్ రాజు ముందుకొచ్చినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles