Unusual Wish to Virushka from Condom Brand | విరుష్కల పేరు మీద కండోమ్ కంపెనీ.. ఒక దెబ్బకు రెండు పిట్టలు

Virushka special wishes trolling

Virat-Anushka, Durex Condom Brand, Virushka, Virushka Durex, Durex Ad Promotion, Virushka Unusual Wishes

After Virat-Anushka wedding, this Durex Condom Brand wants no one to come between them.As Virat Kohli and Anushka Sharma begin their new innings, the condom brand has an unusual wish for them.

విరుష్కలకు వెరైటీగా విషెస్ చెప్పిన కండోమ్ కంపెనీ

Posted: 12/14/2017 03:48 PM IST
Virushka special wishes trolling

ఓవైపు విరాట్ కోహ్లి - అనుష్క‌ జంట హనీమూన్ లో బిజీగా ఉన్నారు. త్వరలో గ్రాండ్ రిసెప్షన్లకు వాళ్లు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇక వారి వివాహం సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. వరుస పెట్టి పలువురు వారికి విషెస్ చెబుతూ వస్తున్నారు. వారితో పాటు పలు కంపెనీలు, సంస్థ‌లు కూడా వారి అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాల్లో విరుష్క జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాయి.

అయితే అన్నింటిలోకి ఓ సంస్థ చేసిన ట్వీట్ మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తోంది. అదే డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ చేసిన ట్వీట్. 'కంగ్రాచ్యులేష‌న్స్‌... విరాట్‌, అనుష్క‌... మీ మ‌ధ్య‌కు దేన్ని అడ్డురానీయ‌కండి.. ఒక్క డ్యూరెక్స్ మిన‌హా' అని రాసి ఉన్న ఫొటోను కంపెనీ ట్వీట్ చేసింది. చివరకు కోహ్లి మెయిడెన్ ఓవర్ బోల్డ్ అయ్యాడంటూ మరో డబుల్ మీనింగ్ తో సందేశం ఉంచారు.

ఒక ప‌క్క విషెస్ చెబుతూనే, మ‌రో ప‌క్క త‌మ బ్రాండింగ్‌ని ప్ర‌చారం చేసుకుంటూ ఆ కంపెనీ చేసిన ట్వీట్‌ను చూసి నెటిజ‌న్లు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు. కంపెనీ తెలివితేట‌ల‌కు తెగ మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం మరీ ఫ‌న్నీ కామెంట్ల‌తో నవ్వులు పూయిస్తున్నారు. అన్నట్లు ఈ మధ్యే ఉద‌యం 6 గం.ల నుంచి రాత్రి 10 గం.ల వ‌ర‌కు కండోమ్ ప్ర‌క‌ట‌న‌ల మీద ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ కండోమ్ యాడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ రణ్ వీర్ సింగ్ అన్న అంశంతో కూడా ట్రోల్ చేసే వాళ్లూ లేకపోలేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles