Oora Mass Title Consider for Teju-Vinayak Movie | వినాయక్ తో చిత్రానికి ఊర మాస్ టైటిల్?

Sai dharam tej new movie title

Dharma Bhai Movie, VV Vinayak, Sai Dharam Tej, Sai Dharam Tej New Movie, Mass Title for Sai Dharam Tej, Sai Dharam Tej Next Title

Dharma Bhai Title Consider for Supreme Hero Sai Dharam Tej VV vinayak Movie. Official Confirmation yet to await.

వినాయక్-తేజూ చిత్రానికి ధర్మా భాయ్ టైటిల్?

Posted: 12/14/2017 03:28 PM IST
Sai dharam tej new movie title

కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మెగా మేనల్లుడు ఎంతలా దూసుకుపోయాడో.. తర్వాత వరుసగా అంతే స్పీడ్ గా వరుస ఫ్లాపులతో డీలా పడిపోతున్నాడు. ఈ ఏడాది మూడు చిత్రాలు.. విన్నర్, నక్షత్రం(గెస్ట్ రోల్), జవాన్ లు మూడు ఫ్లాపులుగానే నిలిచాయి. దీంతో వినాయక్ తో చేస్తోన్న సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమాకి 'ఇంటిలిజెంట్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే వినాయక్ లాంటి మాల్స్ పల్స్ ఉన్న దర్శకుడి నుంచి ఇలాంటి సాఫ్ట్ టైటిల్ రావటం సరికాదన్న అభిప్రాయం మేకర్లు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆలోచనలో పడ్డ వినాయక్ ఓ మాంచి మాస్ టైటిల్ ను తెరపైకి తెచ్చాడు. అదే ధర్మాభాయ్.

ఈ టైటిల్ అయితే మాస్ ఆడియన్స్ లోకి బాగా వెళుతుందనీ .. తేజుకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కనుక, ఇదే టైటిల్ ను ఖరారు చేద్దామని అనుకుంటున్నారట. టైటిల్ విషయంలో నిర్ణయాన్ని తేజు .. వినాయక్ కే వదిలేశాడట. అందువలన దాదాపుగా ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంతో గట్టిగా ఓ హిట్ కొట్టాలని తేజూ భావిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles