South Indian Senior Actor Blinked in Hollywood Movie | హాలీవుడ్ చిత్రంలో మన నటుడు

Kollywood actor nepolean in hollywood movie

Tamil actor Napolean, Napolean Hollywood Movie, Indian Actor in Hollywood Movie, Devil's Night: Dawn of the Nain Rogue, Sam Logan Khalegi New Movie

Tamil actor Napolean makes Hollywood debut. The actor is playing a museum curator in 'Devil's Night: Dawn of the Nain Rogue'. The Movie directed by Sam Logan Khalegi, who has an Emmy nomination to his credit, may also released in Tamil as well as.

హాలీవుడ్ చిత్రంలో సీనియర్ నటుడు నెపోలియన్

Posted: 12/07/2017 01:14 PM IST
Kollywood actor nepolean in hollywood movie

సీనియర్ నటుడు నెపోలియన్ చివరకు పంచెకట్టుకు గుడ్ బై చెప్పారు. కోలీవుడ్ మావీరన్‌గా పేరుగాంచిన ఆయన కొన్ని దశాబ్దాలుగా పంచె కట్టు, కోరమీసం లుక్కులోనే కనిపిస్తూ వస్తున్నారు. తమిళ్, తెలుగు, మళయాళం భాషల్లో 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. సినిమాల్లోనే కాదు.. కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలోనూ ఆయన ఆయన సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తుండటంతో సూట్ బూటులోకి మారిపోయారు.

ధనుష్ ఫకీర్ ఫస్ట్ లుక్

డెవిల్స్‌ నైట్‌–డాన్‌ అఫ్‌ ది నైన్‌ రుజ్‌ అనే అమెరికన్‌ చిత్రం ద్వారా నెపోలియన్‌ హాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలోనే ఎక్కువగా నివశిస్తున్న నెపోలియన్‌ తొలిసారిగా హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. డెవిల్స్‌ నైట్‌ అనే హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన టెల్‌ గణేశన్‌ కైపా ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తుండగా.. ఆయన నెపోలియన్ స్నేహితుడు కావటంతో అవకాశం దక్కింది. ఈ భారీ చిత్రానికి ఎమ్మీ నామినేటెట్‌ దర్శకుడు శ్యామ్‌ లోగన్‌ కరేలి దర్శకత్వం వహిస్తున్నారు.

హాలీవుడ్‌ నటులు జెసీ జెన్సన్, బాబీలెనిన్, జాక్‌ సీ, ఫార్మన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇది హర్రర్‌ కథా చిత్రం అని సోమవారం చెన్నైలో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నెపోలియన్‌ తెలిపారు. ఇందులో ఆయన మ్యూజియమ్ క్యూరేటర్ పాత్రలో నటించబోతున్నాడంట. అక్టోబర్ నుంచే ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తమిళ్ లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles