Temper Hindi Remake Simmba First look out | టెంపర్ రీమేక్ ఫస్ట్ లుక్.. ఫన్నీ పోలీసాఫీసర్ గా రణ్ వీర్

Temper remake first look out

Temper Remake, Simmba Movie, Ranveer Singh, Rohit Shetty, Simmba first look poster, Simmba First Look Poster, Temper Hindi Remake, Temper Ranveer Singh, Simmba Release Date,

Temper Hindi Remake Simmba First look poster out. Rohith Shetty directs this movie and will release on December 28th 2018.

హిందీ టెంపర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 12/07/2017 11:07 AM IST
Temper remake first look out

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కెరీర్ కు టెంపర్ సినిమా ఎలాంటి ఊరటనిచ్చిందో తెలిసిందే. ఆ తర్వాత వరుస సక్సెస్ లతో తారక్ దూసుకుపోతున్నాడు. పూరీ కెరీర్ కు కూడా చాలా కాలం తర్వాత హిట్ ఇచ్చిందీ చిత్రం. ఇక ఈ చిత్ర బాలీవుడ్ రీమేక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది.

యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రోహిత్ శెట్టి డైరెక్షన్ లో క్రేజీ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ వదిలారు. శింబా టైటిల్ ను ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. కరణ్ జోహర్, రోహిత్ శెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాతృక లోని కాన్సెప్ట్ ను మాత్రమే తీసుకున్న దర్శకుడు రోహిత్ మరింత ఎంటర్ టైన్ తో శింబాను తెరకెక్కించబోతున్నాడంట.

ఇక చిత్ర హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. పద్మావతిలో అల్లావుద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్ కోసం రణ్ వీర్ ఎంత కన్నింగ్ గా కనిపించాడో.. ఇక్కడ కరెప్ట్ పోలీసాఫీసర్ పాత్ర కోసం అంతే ఫన్నీగా తయారయిపోయాడు. సింబ అకా సంగ్రామ్ భలేరావ్ గా రణ్ వీర్ నటించబోతున్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్ 28న చిత్రం రిలీజ్ అవుతున్నట్లు అల్రెడీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Nani reacted on story change rumour

  కృష్ణార్జున యుద్ధం రూమర్ పై నాని స్పందన

  Jan 20 | యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి... Read more

 • Bigg boss contestant in prabhas movie

  ప్రభాస్ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ

  Jan 20 | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో ప్రభాస్ తన... Read more

 • Kamal movie with chiyaan

  కమల్ నిర్మాత.. విక్రమ్ హీరోగా సినిమా

  Jan 20 | లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ మళ్లీ నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. త్వ‌ర‌లో చియాన్ విక్రమ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కమల్ రెండో తనయ అక్ష‌ర హాస‌న్ హీరోయిన్ గా న‌టించ‌బోతుండగా.. సినిమాకు కమల్ శిష్యుడు... Read more

 • Anasuya clarity on rangasthalam role

  రంగస్థలంలో అత్త పాత్ర కాదు : అనసూయ

  Jan 20 | హాట్ యాంకర్ అనసూయ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. రంగస్థలంలో రామ్ చరణ్ కు తాను అత్త పాత్రలో నటించట్లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. గత కొంత కాలంగా ఆమె చెర్రీకి అత్త పాత్రలో కనిపించబోతుందని... Read more

 • Varun tej next space thriller

  స్పేస్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్

  Jan 20 | షార్ట్ ఫిలింస్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్సించిన సంకల్ప్ రెడ్డి ద ఘాజీ ఎటాక్ తో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు. చరిత్రలో కనుమరుగు అయిపోయిన అంశాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించి మూడు భాషల్లోనూ హిట్... Read more

Today on Telugu Wishesh