Married Actress Open up About Love Affairs | పెళ్లయ్యాక లవ్ అఫైర్ల గురించి నటి నమిత

Namitha about affairs

Actress Namitha, Actress Namitha Love Affairs, Namitha Husband, Actress Namitha Interview, Actress Namitha Past, Actress Namitha About Husband, Namitha about Carrier , Namitha Latest Interview

Actress Namitha open up about Love Affairs after marriage. She had three love stories in past.

లవ్ అఫైర్ల గురించి నటి నమిత

Posted: 12/06/2017 12:57 PM IST
Namitha about affairs

సినిమాల క్రమక్రమంగా దూరమౌతున్న తరుణంలో ప్రియుడు వీర్ ను వివాహం చేసుకున్న నమిత సడన్ షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. అయితే కెరీర్ పరంగా తానెంత హ్యాపీగా ఉన్నానో.. ఇప్పుడు పర్సనల్ లైఫ్ పై కూడా అంతే హ్యాపీగా ఉన్నానని ఆమె అంటోంది. పెళ్లయ్యాక ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

తనను వీర్ కలిసి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఆయనను తిరస్కరించేందుకు ఒక్క కారణం కూడా కనిపించలేదని తెలిపింది. ఒకవేళ ఆయన ప్రపోజ్ చేయకపోయి ఉంటే, తానే ప్రపోజ్ చేసి ఉండేదానినని నమిత తన మనసులోని మాటను వెల్లడించింది.తనకు గతంలో మూడు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని నమిత తెలిపింది. గతంలో ఆ మూడు లవ్ ఫెయిల్యూర్స్ జీవితంలో సరైన వ్యక్తిని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో తెలిసేలా చేశాయని చెప్పింది. ఈ విషయం వీర్ కు తెలుసని ఆమె వ్యాఖ్యానించింది.

పెళ్లి తరువాత తన జీవితంలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదని, అయితే మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు మాత్రం కొత్తగా వచ్చాయని చెప్పింది. అంతే తప్ప సంప్రదాయం పేరుతో కుంకుమ బొట్టు పెట్టుకో, చీరకట్టుకో అంటూ భర్త కానీ, అత్తమామలు కానీ తనపై ఎటువంటి నిబంధనలూ పెట్టలేదని తెలిపింది. అవకాశాలు వస్తే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles