Prakash Raj sends notice to Karnataka BJP for trolling | ప్రకాశ్ రాజ్ వ్యక్తిగత లైఫ్ డిస్టర్బ్ అయ్యింది.. ఎంపీకి లీగల్ నోటీసులు పంపాడు

Prakash raj legal notices to bjp mp

Actor Prakash Raj, Actor Prakash Raj Legal Notices, Mysuru BJP MP Pratap Simha, Prakash Raj Pratap Simha, Pratap Simha Trolling Prakash Raj

Actor Prakash Raj who has been in the news lately for his outspoken comments against the Prime Minister and the BJP has sent a legal notice to Mysuru BJP MP Pratap Simha. The actor has taken umbrage to Simha’s derogatory comments where he has made personal remarks at Prakash Raj. In the legal notice sent by Prakash Raj’s advocate Naveen Nagarjuna.

బీజేపీ ఎంపీకి ప్రకాశ్ రాజ్ లీగల్ నోటీసులు

Posted: 11/23/2017 06:35 PM IST
Prakash raj legal notices to bjp mp

అవకాశం దొరికిన‌ప్పుడ‌ల్లా కేంద్ర ప్ర‌భుత్వంపై న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి రానంటూనే.. కన్నడ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై విమ‌ర్శ‌లు, హిందువుల‌ను తీవ్ర వాదుల‌తో పోల్చ‌డం వంటి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌కాశ్‌రాజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం ప్ర‌కాశ్‌రాజ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహా ప్రకాశ్‌రాజ్ పర్సనల్ లైఫ్ పై దారుణ వ్యాఖ్యలు చేశాడు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రకాశ్ రాజ్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇటువంటి మాట‌లు మాట్లాడుతున్నార‌ని అన్నారు. వెంట‌నే భార్య‌ను వ‌దిలేసి, ఓ డ్యాన్స‌ర్ వెనకాల వెళ్లిపోయిన ప్ర‌కాశ్‌రాజ్‌కు మోదీ, యోగీని విమ‌ర్శించే నైతిక హ‌క్కు ఎక్క‌డిద‌ని ఆయ‌న అన్నారు.

దీనిపై స్పందించిన ప్ర‌కాశ్ రాజ్.. తానొక మంచి న‌టుడిన‌ని, మోదీ న‌టిస్తోంటే తాను ఆ విష‌యాన్ని గుర్తించ‌లేన‌ని అనుకుంటున్నారా? అని అన్నారు. తాను ఓ న‌టుడిన‌న్న గౌర‌వం అయినా త‌న‌కు ఇవ్వండ‌ని, ఎందుకంటే తాను ఏది స‌త్య‌మో ఏది న‌ట‌నో గుర్తించి మాట్లాడ‌గ‌ల‌న‌ని పేర్కొన్నారు. దీనికి ప్ర‌తాప్ సింగ్ మ‌ళ్లీ కౌంటర్ ఇచ్చాడు. ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. 'క‌న్న‌డ‌లో నీ పేరు ప్ర‌కాశ్‌రాయ్, త‌మిళంలో ప్ర‌కాశ్‌రాజ్ నీ అవ‌స‌రాన్ని బ‌ట్టి ప్ర‌తి రాష్ట్రంలో పేరు మార్చుకుంటున్నావు' అని పేర్కొన్నారు.

తాజాగా ప్ర‌తాప్‌సింహా వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ ప్రకాశ్‌రాజ్...ఆయనపై కేసు వేయబోతున్నానని ప్రకటించాడు. స‌ద‌రు బీజేపీ నేత‌కు తాను లీగల్ నోటీసులు పంపాన‌ని, ప్ర‌తాప్ సింహా చేసిన వ్యాఖ్యలపై జ‌వాబు ఇవ్వాల‌ని, లేక‌పోతే ఆయనపై క్రిమినల్ కేసులు వేస్తాన‌ని ప్రకాశ్ రాజ్ హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles