Ajith again fixed for V sentiment | ఫ్లాపు అయినా అదే దర్శకుడితో.. టైటిల్ కూడా సెంటిమెంట్ ప్రకారం ఇదేనంట!

Ajith new movie title

Thala Ajith, Thala 58 Movie, Thala Ajith New Movie Updates, Ajith Siva New Movie, Ajith Siva Viswasam, Viswasam Movie, Viswasam Title

Director Siva will be collaborating with Thala Ajith yet again. The project, which has been titled Viswasam, is Siva’s fourth consecutive directorial outing with Tamil star Ajith after delivering three blockbusters in the last three years.

అజిత్ కొత్త చిత్ర టైటిల్ విశ్వాసం?

Posted: 11/23/2017 03:50 PM IST
Ajith new movie title

కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కుమార్ తన తర్వాతి చిత్రం కూడా దర్శకుడు శివతోనే తీయబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.

వీరిద్దరి కాంబోలో గతంలో వీరమ్ .. 'వేదాళం' .. రీసెంట్ గా'వివేగం' వచ్చాయి. దీంతో తర్వాతి చిత్రానికి కూడా వీ సెంటిమెంట్ వర్తింపజేయాలని ఇద్దరూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకుగానూ విశ్వాసం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. జనవరి నుంచి విశ్వాసం సెట్స్ మీదకు వెళ్లబోతుందంట.

ఈ ఇద్దరి కాంబోలో వరుసగా వస్తున్న ఈ చిత్రాలు బడ్జెట్ పరంగా భారీగానే తెరకెక్కటంతోపాటు.. వసూళ్లను కూడా అదే స్థాయిలో సాధిస్తూ తల కెరీర్లోనే స్పెషల్ గా నిలుస్తున్నాయి. అయితే వివేగం(తెలుగులో వివేకం) మాత్రం కథపరంగా నిరాశపరిచింది. అయినప్పటికీ క్రేజీ కాంబినేషన్ కావటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అజిత్ 58వ చిత్రంగా తెరకెక్కబోతున్న విశ్వాసంలో హీరోయిన్ పాత్ర, మిగతా పాత్రధారుల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles