Young Hero Finally In search of his Life Partner | ఇది ప్రాంక్ వీడియో కాదంటున్న కోలీవుడ్ హీరో ఆర్య

Aarya shares marriage proposal video

Hero Aarya, Aarya Video, Hero Aarya Marriage Proposal, Aarya Marriage Request, Hero Aarya Online Marriage Proposal

Finally Hero Aarya In search of his Life Partner. No conditions demands actor Aarya explains marriage expectations.

పెళ్లి ప్రపోజల్ వీడియో షేర్ చేసిన ఆర్య

Posted: 11/21/2017 05:24 PM IST
Aarya shares marriage proposal video

కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న ఆర్య త్వరలో పెళ్లికి సిద్ధమైపోతున్నాడు. త‌న‌కు జీవిత భాగ‌స్వామి కావాల‌ని కోరుతూ న‌టుడు ఆర్య ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను భార్య కోసం వెతుకుతున్నాన‌ని వీడియోలో పేర్కొన్నాడు. ‘సాధార‌ణంగా జీవిత భాగ‌స్వామి కోసం స్నేహితులనో, మాట్రిమోని సైట్లనో సంప్రదిస్తారు. కానీ నేను అలా కాదు. భాగ‌స్వామి విష‌యంలో నాకు ఎలాంటి డిమాండ్లు, ష‌ర‌తులు లేవు’ అని ఆర్య తెలిపాడు.

ఇది జోక్ కాదని. ప్రాంక్ వీడియో కాదని. తన జీవితానికి సంబంధించిన విష‌యమన్న ఆర్య... ద‌య‌చేసి కాల్ చేయండి. మీ కాల్ కోసం ఎదురుచూస్తున్నా!' అంటూ ఆర్య వీడియోలో తెలిపాడు. తానోక మంచి భర్తను అవుతాననిపిస్తే వెంటనే 73301 73301 నెంబ‌ర్‌కి కాల్ చేయాలని సూచించాడు. వీడియోలో చెప్పిన నెంబ‌ర్‌కి కాల్ చేస్తే మీకొక మెసేజ్ వ‌స్తుంది.

ఆ సందేశంలో ఆర్య మాట్రిమోని వెబ్‌సైట్ www.mapillaiarya.com లింక్ ఉంటుంది. ఆ సైట్‌లో త‌న‌కు భార్య కావాల‌నుకున్న వారు వివ‌రాలు నింపాల‌ని సూచ‌న‌లు ఉంటాయి. భాష, కులం, స్టేట‌స్ వంటి వాటికి స్థానం లేద‌ని వెబ్‌సైట్‌లో ఉన్న డేటా చూస్తే అర్థ‌మ‌వుతోంది. అక్క‌డున్న వివ‌రాల‌న్నీ నింపి ఫొటో, వీడియో అప్‌లోడ్ చేసి ఆర్య‌కి భార్య అయ్యే ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles