Posani Strong reaction on Nandi Awards Controversy | లోకేశ్ పై పోసాని ఓ రేంజ్ లో ఫైర్.. ’కమ్మ‘ నంది వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటన

Posani reacted on nandi controversy

Posani Krishna Murali, Nandi Awards Controversy, Posani Nandi Issue, Posani Nandi Awards, Posani Press Meet

Posani Krishna Murali Reacts on Nandi Awards Controversy. Posani fire on Minister Nara Lokesh over Aadhar Comments and he given back his award.

నంది వివాదం.. లోకేష్ పై ఫైర్ అయిన పోసాని

Posted: 11/21/2017 04:35 PM IST
Posani reacted on nandi controversy

నంది వివాదంపై రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి ఘాటుగా స్పందించారు. తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని... ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే, అప్పుడు తీసుకుంటానని చెప్పారు. నంది అవార్డులను రద్దు చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా మళ్లీ ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తాము ఎన్నారైలు అయితే లోకేష్ ఎవరని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ తిట్టలేదని చెప్పారు. ఏపీ రాజకీయ నేతలను మాత్రమే తిట్టారని అన్నారు. లోకేష్ కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే... మమ్మల్ని తరిమికొట్టేవారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు.

నారా లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అని పోసాని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అయితే... తాము తెలుగు రోహింగ్యాలమవుతామని చెప్పారు. తెలంగాణలో పన్నులు కడుతున్నందుకు... తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? అని అడిగారు. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ పోసాని సీరియస్ గా స్పందించారు.

ఎన్టీవీ సౌజన్యంతో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles