Sweet Biopic Confirmed by Bengali Director | బెంగాలీలకు గుడ్ న్యూస్.. ఆ స్వీట్ పై బయోపిక్ వచ్చేస్తోంది.

Biopic on rasagulla maker

Rasgulla Biopic, Rasgulla Maker Biopic, Nabin Chandra Das Movie, Rasgulla Bengali Movie, Director Pavel, Bengali Sweet Biopic, Movie on Rasgulla

Rasgulla is a sweet which is not only famous among the Bengalis but is equally popular among the non-Bengalis. Director Pavel’s second film is about this sweet delicacy and focuses on the life of the maker Nabin Chandra Das.

రసగుల్లా బయోపిక్ కు రంగం సిద్ధం

Posted: 11/20/2017 06:24 PM IST
Biopic on rasagulla maker

రసగుల్లా స్వీట్లలో ఒకటైన దీని పేటెంట్ హక్కుల కోసం ఆ మధ్య ఒడిశాతో బెంగాల్ బాగానే ఫైట్ చేసింది. రెండున్న‌రేళ్లుగా పోరాటంతో ఎట్టకేలకు విజ‌యం సాధించి, ఇటీవ‌ల త‌మ రాష్ట్రం పేరు మీదుగా తీపి పదార్థం ర‌స‌గుల్లాకు భౌగోళిక గుర్తింపు ల‌భించినందుకు బెంగాలీలు చాలా సంతోష‌ప‌డ్డారు.

ఇదిలా ఉంటే మిఠాయి వాలా నవీన్ చంద్ర దాస్ 1868లో ర‌స‌గుల్లాను త‌యారుచేశాడు. ర‌స‌గుల్లాను త‌యారుచేసిన దాస్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీయాల‌న్న ఆలోచన మొదలైంది. కోల్‌క‌తాకు చెందిన పావెల్ అనే ద‌ర్శ‌కుడు, ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. నిజానికి ఈ ఫిబ్రవరిలోనే ఈ పాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ.. వివాదం కారణంగా ఇంత కాలం పెండింగ్ లోఉంటూ వస్తోంది. ఇక ఇప్పుడు లైన్ క్లియర్ కావటంతో పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు.

వ‌చ్చే ఏడాదికి ర‌స‌గుల్లా త‌యారై 150 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని 2018లో విడుద‌ల చేయాల‌ని చిత్రాన్ని నిర్మించ‌నున్న విండోస్ ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది. ఈ చిత్రానికి `ర‌స‌గుల్లా` అనే పేరును కూడా ఖ‌రారు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. విండోస్ సంస్థ అధినేత ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు అధ్యయంన చేసినట్లు దర్శకుడు పావెల్ చెబుతున్నాడు. ఓ ప్రేమ కథగానే దీనిని తెరకెక్కించబోతున్నాడంట.

Rasgulla Movie

నవీన్ చంద్ర దాస్

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles