Gopi Chand Experiment with land Mark Movie | గోపిచంద్ ఎందుకింత సాహసం?

Gopi chand new director movie

Gopi Chand, Gopi Chand 25th Movie, Gopi Chand Land Mark Movie, Gopi Chand New Movie, Gopi Chand Mehreen Pirzada Movie, Gopi Chand Director Chakri

Gopi Chand Experiment with 25th Movie. He Acted under Debutante director Chakri.. Mrhreen as Heroine. Movie Launched Recently.

ల్యాండ్ మార్క్ చిత్రంపై గోపీచంద్ ప్రయోగం?

Posted: 11/20/2017 04:41 PM IST
Gopi chand new director movie

కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు గోపీచంద్. అయితే గోపీచంద్ కి కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. దాంతో ఆయన అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

గత చిత్రం గౌతమ్ నంద కూడా దారుణంగా నిరాశపరచటంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలో చక్రి దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టాడు. 'జై లవ కుశ' సినిమాకి అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన చక్రి .. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ఇక్కడే గోపీచంద్ తీసుకున్న నిర్ణయంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మైలు రాయి చిత్రాలను చాలా ఘనంగా తీసేందుకు ఏ హీరో అయినా ఇష్టపడతారు.

గోపీచంద్ కి ఇది 25వ సినిమా. దీంతో పెద్ద దర్శకుడితో చేస్తాడేమో అని అంతా ఆశిస్తారు. కానీ, ఈ మాస్ హీరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం విశేషం. కంటెంట్ పై నమ్మకంతోనే ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని చెప్పుకుంటున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopi Chand  25th Movie  గోపీచంద్  25వ చిత్రం  

Other Articles