Mirchi actress Denies Secret Wedding Rumours | సీక్రెట్ పెళ్లి వార్తలపై మిరపకాయ్ హీరోయిన్ రియాక్షన్

Michi actress not secretly married

Richa Gangopadhyay, Richa Gangopadhyay Twiiter, Richa Gangopadhyay Marriage, Richa Gangopadhyay Rumours, Richa Gangopadhyay Interview

Richa Gangopadhyay denies secret marriage rumours. In some media channels quoted Richa ties the knot with her childhood friend secretly in US.

పెళ్లి వార్తలపై ఫైర్ అయిన మిర్చి హీరోయిన్

Posted: 11/20/2017 03:29 PM IST
Michi actress not secretly married

తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ వచ్చినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవటంతో సినిమాలకు రిచా గంగోపాధ్యాయ గుడ్ బై చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ట్విట్టర్ లో స్పందించాల్సి వచ్చింది.

ఇలాంటి వదంతులను సృష్టించొద్దని ఆమె కోరారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వార్తను తానే ముందుగా తెలియజేస్తానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని అన్నారు. తాను నటించబోయే తర్వాతి సినిమా ఏంటని చాలా మంది అడుగుతున్నారని, వాళ్లందరికీ తాను చెప్పబోయే సమాధానం.. ‘నేను సినిమాలకు స్వస్తి చెప్పి ఐదేళ్లు’ అయిందని అన్నారు. ఇప్పుడు తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టానని, ఇందులో నటన అనే అంశానికి తావు లేదని రిచా చెప్పుకొచ్చారు. మీ సరదా కోసం కాకుండా ఫ్రోఫెషనలిజంగా పనిచేయాలంటూ ఫేక్ వార్తలు ప్రచురించిన మీడియా వాళ్లపై మండిపడింది.

కాగా, ‘లీడర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా, ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’, ‘భాయ్’ చిత్రాల్లో నే కాకుండా, ధనుష్, శింబు(దబాంగ్ రీమేక్ ఓస్తీ)  తమిళ చిత్రాల్లోనూ రిచా నటించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles