Hyper Aadi Fires On Kathi Mahesh | పరాయి దేశం గుర్తించినప్పుడు.. నువ్వెందుకు గుర్తించవు?

Hyper aadi about kathi mahesh

Hyper Aadi, Kathi Mahesh, Pawan Fans, Hyper Aadi Kathi Mahesh, Hyper Aadi About Mahesh, Hyper Aadi Warn Kathi Mahesh

Hyper Aadi Clarified his Satires on Kathi Mahesh Continues. and Aadi Warned Don't make comments on Celebs and Fans.

కత్తి మహేష్ పై సెటైర్లు వేయటం ఆపను : హైపర్ ఆది

Posted: 11/17/2017 09:29 AM IST
Hyper aadi about kathi mahesh

పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన కామెంట్లపై ఎట్టకేలకు జబర్దస్త్ నటుడు హైపర్ ఆది స్పందించాడు. అసలు మహేష్ ఎవరో తనకు తెలియదని, లండన్ బాబులు ప్రివ్యూ సందర్భంగా తొలిసారి అతన్ని చూశానని ఆది చెప్పాడు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న ఆది పనిలో పనిగా కత్తి మహేష్ పై సెటైర్లు వేశాడు.

అసలు మహేష్ కు పొట్ట, బట్ట లేదని.. ఆయన చాలా క్యూట్ గా ఉన్నాడని, ఆయనను క్యూట్ బోయ్ అంటానని ఎద్దేశా చేశాడు. కత్తి మహేష్ ను దృష్టిలో పెట్టుకుని తాను పంచ్ డైలాగులు వేయలేదని, తాను తమ ఊర్లో ఉన్న సుత్తి రాజేష్ గురించి వ్యాఖ్యానించానని అన్నాడు. సుత్తి రాజేష్ ఇల్లిల్లూ తిరుగుతూ పని చేసుకుని బతుకుతాడని, ఫేస్ బుక్ లో ఏది పడితే అది అంటాడని అన్నాడు. తన వీడియోలు కోటి మంది చూస్తారని, కత్తి మహేష్ రివ్యూలు లక్ష మంది చూస్తారని అన్నాడు.

కత్తి మహేష్ అంగీకరిస్తే... జబ్బర్దస్త్ స్కిట్ లో అతనిని వాడుకుంటానని హైపర్ ఆది అన్నాడు. ఆయన చాలా క్యూట్ గా ఉంటాడని, తన స్కిట్ లో మంచి వేషం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆయనలోని కామెడీ యాంగిల్ ను వాడుకుంటానని చెప్పాడు. తాను సెలబ్రిటీ అవ్వాలని మహేష్ అనుకుంటున్నాడని హైపర్ ఆది అభిప్రాయపడ్డాడు. బిగ్ బాస్ లో పాల్గొన్న సందర్భంగా కత్తి మహేష్ చికెన్ వండిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, తమ సుత్తి రాజేష్ ఇడ్లీలు, దోశలు, పెసరట్లు వేస్తుంటాడని, అవి ఛండాలంగా ఉంటాయని, వద్దురా అన్నా వినడని పంచులు చేశాడు.

కత్తి మహేష్ తాను సెలబ్రిటీని అని అనుకుంటున్నాడని హైపర్ ఆది ఎద్దేవా చేశాడు. పవన్ కల్యాణ్ ను విమర్శించే స్థాయి కత్తి మహేష్ కు లేదని అన్నాడు. తన ఫోటో పెట్టి ఫ్యాన్స్ కు 'మేము మేము ఇలా కలిసిపోతాము.. మధ్యలో వెధవలయ్యేది మీరే'నని వ్యాఖ్యానించాడని, తాము ఫ్యాన్స్ ను అలా అనమని అన్నాడు. స్క్రిప్టు రాయాలంటే చాలా కష్టమని, అంత కష్టపడి సినిమా తీస్తే అది బాగో లేదనడానికి కత్తి మహేష్ ఎవరని ఆది ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ పై అవాకులు చవాకులు వాగుతుంటాడని, 'అలా వద్దురా సుత్తి రాజేష్' అన్నా వినడని... పవన్ కల్యాణ్ ను పక్కదేశం (ఇంగ్లండ్) గుర్తిస్తే మనమెందుకు గౌరవించమని ప్రశ్నించాడు. కత్తి చవాక్కులు కొనసాగేంత కాలం తాను పంచులు వేయటం ఆపనని ఆది స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles