3rd Biopic on NTR Faces Trouble Everywhere | లక్ష్మీస్‌ వీరగ్రంథం.. అడుగడుగునా కష్టాలు

Troubles starts for lakshmi s veera grandham

Lakshmi's Veera Grandham, Kethireddy Jagadeeswar Reddy, NTR Biopic, Lakshmi's Veera Grandham Nimmakuru, Lakshmi's Veera Grandham Shooting, Lakshmi's Veera Grandham Troubles

NTR Biopic Lakshmi's Veera Grandham Hits The Floors. but, Denial Permission for Shooting Every Where. But, Telugu producer Kethireddy Jagadeeswar Reddy Confident about Movie.

లక్ష్మీస్‌ వీరగ్రంథం షూటింగ్ కు అవాంతరాలు

Posted: 11/14/2017 08:55 AM IST
Troubles starts for lakshmi s veera grandham

స్వర్గీయ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ లలో ఒకటైన 'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమాకు షూటింగ్ మొదలుకాకముందే కష్టాలు మొదలయ్యాయి. ముహూర్తం సన్నివేశాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చిత్రీకరించడానికి ఇటీవల చిత్ర బృందం ప్రయత్నించింది. అయితే, దీనిని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా పోస్టర్‌ ఎదుట దర్శకుడు జగదీశ్వర్‌రెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ స్వస్థలంలో కూడా వారికి చేదు అనుభవమే ఎదురైంది.

కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో జరిపేందుకు చేసిన ప్రయత్నాలను ఆ గ్రామ వాసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు పంచాయతీ పెద్దలను ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. సన్నివేశాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో సమావేశమైన పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు చిత్రీకరణకు అభ్యంతరం చెప్పారు. ఈ సినిమా కారణంగా ఎన్టీఆర్ తో పాటు నిమ్మకూరుకు కూడా చెడ్డపేరు వస్తుందని, అందుకే అనుమతి ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు.

దీంతో గ్రామస్థులకు ఇష్టం లేకుండా సన్నివేశాలు చిత్రీకరించమని చెబూతూ చిత్రయూనిట్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వెనుదిరిగారు. మరి మున్ముందు ఈ చిత్రం ఇంకెన్ని ఆటంకాలు ఎదురుకోవాల్సి ఉంటుందో చూడాలి. అన్నట్లు లక్ష్మీ రాయ్ ను ఓ కీలక పాత్ర తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. ఆ వార్తపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles