Fire Accident at Aishwarya Rai Mother's House | ఐష్ ఇంట్లో అగ్ని ప్రమాదం.. సచిన్ అత్త కూడా అదే అపార్ట్ మెంట్

Fire accident at aish home

Aishwarya Rai Bachchan, Aishwarya Rai Bachchan Fire Accident, Aishwarya Rai Bachchan Mother, Bandra West La Mer residential, Aishwarya Rai Mother House, Saxhin Mother in Law Annabel Mehta, Annabel Mehta Aishwarya Rai Mother, Annabel Mehta Aishwarya Rai Couple

Aishwarya Rai Bachchan Visits Parents' House With Abhishek Bachchan After Fire Breaks Out A massive fire broke out on Tuesday at La Mer residential building in Bandra West, Mumbai.

ఐష్ ఇంట్లో అగ్ని ప్రమాదం

Posted: 10/24/2017 05:46 PM IST
Fire accident at aish home

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న అపార్ట్ మెంటులో పెళ్లికాక ముందు ఐశ్వర్య ఉండేది. వివాహానంతరం జుహులోని భర్త నివాసానికి ఐశ్వర్య వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆమె తల్లి బృందా రాయ్ ఉంటున్నారు.

ఈ ఉదయం మంటలు ఒక్కసారిగా చెలరేగటం.. సమాచారం అందుకున్న ఫైరింజన్లు అక్కడికి చేరుకుని తీవ్రంగా శ్రమించాయి. మంటలను ఆర్పడానికి ఎనిమిది ఫైరింజన్లు అక్కడికి రావటం విశేషం. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే... 12వ ఫ్లోర్ లో ఐశ్వర్య తల్లి నివసిస్తుండగా, 10వ ఫ్లోర్ లో సచిన్ టెండూల్కర్ అత్త ఉంటున్నారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకునే సరికి బచ్చన్ దంపతులుతో సచిన్ అత్త అన్నాబెల్ మెహతాతో ముచ్చటించటం కంటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles