2.0 is Getting Bigger by Day of Audio Event | ఇలాంటి ఆడియో ఆహ్వానం ఎక్కడా చూసి ఉండరు

Robo sequel audio launch event

2.0, 2.0 Audio, Rajinikanth's 2.0 Movie, 2.0 Movie, 2.0 Audio Audio Function, 2.0 Shooting Wrap Up

Rajinikanth's 2.0 is Getting Bigger by Day, Exciting Invitation 2.0 is Getting Bigger by Day, Exciting Invitation. Viewers Ready to Pay Huge amount for Tickets. On October 27th Audio Event.

2.0 ఆడియోకు రంగం సిద్ధం

Posted: 10/23/2017 06:51 PM IST
Robo sequel audio launch event

శంకర్-రజనీ 2.0 షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది.  దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో '2.0' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ లోని 'బుర్జ్ ఖలీఫా' పార్క్ .. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి వేదికగా మారుతోంది.

భారీ ఖర్చుతో అక్కడ జరగనున్న ఆడియో ఈవెంట్ ను చూడటానికి ఎంతోమంది ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. దాంతో ఒక్కో టికెట్ ధర రూ.60 వేలు పలుకుతోందట. అయినా టికెట్స్ ను కొనడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదని చెబుతున్నారు. ఒక దక్షిణాది సినిమాకి సంబంధించి .. ఈ ప్రదేశంలో ఈ స్థాయిలో ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనేది యూనిట్ వర్గాలవారు చెబుతోన్న మాట. జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కానుంది.అన్నట్లు అతిథుల కోసం డిజైన్ చేసిన ఇన్విటేషన్ కూడా చాలా ఖర్చుతో కూడుకుందని అర్థమౌతోంది. రోబో చేతులతోపాటు విలన్ చేతులు పియానోపై ఉన్నట్లు ఆహ్వాన పత్రికను ముద్రించి వదిలారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles