Anti BJP Comments GST Raids on Hero Vishal | విశాల్ కు షాక్.. బీజేపీ వ్యతిరేక కామెంట్ల నేపథ్యంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ దాడులు?

It attack on hero vishal

Actor Vishal, Vishal IT Raids, Income Tax Actor Vishal, Vishal GST, Vishal GST Raids, Vishal BJP Raja, Actor Vishal IT Raids, Mersal H Raja Piracy, Vishal Mersal Piracy, GST Intelligence Agency Raids on Vishal, GST Intelligence Agency

GST Intelligence Agency Raids on Hero Vishal. Chennai House and Offices. Suspects as Vishal Comments on BJP Leader Raja leads to raids.

హీరో విశాల్ ఫై జీఎస్టీ దాడులు

Posted: 10/23/2017 05:39 PM IST
It attack on hero vishal

నటుడు విశాల్ కు పెద్ద ఝలక్ తగిలింది. టాక్స్ అధికారులు విశాల్ ఇల్లు, ఆఫీస్ లపై సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. జీఎస్టీ తర్వాత విశాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి టాక్సులు సక్రమంగా చెల్లించలేదని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

కాగా, విశాల్ తాజాగా మెర్సల్ సినిమాకు మద్దతుగా బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నేత రాజా పైరసీ మార్కుపై మండిపడ్డ విశాల్.. స్వేచ్ఛా హక్కును హరించటం సరికాదంటూ బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్  ఏజెన్సీ దాడులు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరపళినగర్ లోని విశాల్ కంపెనీ లో మూడు గంటలకు పైగా సోదాలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ఇక తానేం పైరసీలో సినిమా చూడలేదని.. మొబైల్ ఫోన్ కి వచ్చిన క్లిప్పులనే చూశానని రాజా చెప్పటం విశేషం.వాటి ఆధారంగానే అవి వివాదాస్పద డైలాగులని చెప్పానని ఆయన అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles