NTR Pawan Closeness at Movie Launch Event | ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ లాంఛ్.. హగ్ చేసుకుని మరీ పవన్ విషెస్

Ntr new movie launch

Pawan Kalyan, NTR 28th Movie, NTR Pawan Kalyan, Pawan Kalyan Trivikram, Pawan Bend in front of NTR

Pawan Kalyan Clapped for NTR-Trivikram Movie. The Movie regular shooting starts soon.

ఎన్టీఆర్ 28వ చిత్ర షూటింగ్ ప్రారంభం.. సందడి చేసిన పవన్

Posted: 10/23/2017 04:30 PM IST
Ntr new movie launch

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ చిత్రం ఎట్టకేలకు మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా  హాజరై ముహుర్తం షాట్ తో క్లాప్ కొట్టగా.. ఎన్టీఆర్ పై తొలి సన్నివేశం చిత్రీకరించారు. రామానాయుడు స్టూడియోస్‌ లో ఓ చిత్ర ప్రారంభోత్సవం వైభవంగా జరగగా, ఎన్టీఆర్ భార్య ప్రణతి, కుమారుడు అభయ్‌ రామ్ లు సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సినిమా పూజా కార్యక్రమాలకు వచ్చిన పవన్ ను స్వయంగా ఎదురెళ్లి ఎన్టీఆర్ ఆహ్వనించి.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఆపై కాసేపు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లాడారు. అనంతంరం పవన్ చేతుల మీదుగా సినిమా ప్రారంభం అయింది.

వందలాది మంది ఎన్టీఆర్, పవన్, త్రివిక్రమ్ అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ (వై దిస్ కొలవెరి ఫేం) తదితరులు హాజరయ్యారు. అనిరుథ్ సంప్రదాయ తమిళ వేషధారణలో ఎరుపు రంగు ధోవతి, తెలుపు రంగు కుర్తా ధరించి రాగా, పవన్-ఎన్టీఆర్ లతో కలిసి సందడి చేశారు. త్వరలో చిత్రానికి సంబంధించిన పూర్తి అప్ డేట్లు వెలువడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles