Saaho First Look Poster Hollywood Copy | సాహో ఫస్ట్ లుక్.. గంటల్లోనే కాపీ అంటూ వైరల్

Saaho first look out

Prabhas Birthday, Saaho Firstlook, Saaho Firstlook Hollywood, Saaho Copy Poster, Blade 2049 Movie

On Prabhas Birthday Saaho Movie First Look Poster Released. But, in Social Media its viral that Copy of Hollywood Movie Blade 2049.

సాహో ఫస్ట్ లుక్ రిలీజ్.. కాపీ అంటూ సెటైర్లు

Posted: 10/23/2017 03:24 PM IST
Saaho first look out

ఎట్టకేలకు ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. సుమారు ఐదేళ్ల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ని స్టైలిష్ రూపంలో చూసుకుని అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హాలీవుడ్ హంగులతో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా సాహో లుక్కుపై అభినందనలు కురిపిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్, పలువురు హీరోహీరోయిన్లు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా ప్రభాస్ కు విషెస్ చెబుతూ పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు.

ఇక అసలు పాయింట్ కు వస్తే.. షరా మాములుగా ఈ సినిమా కూడా కాపీ మార్క్ తప్పలేదు. హాలీవుడ్ మూవీ బ్లేడ్ రన్నర్ 2049 చిత్రంలో నటుడు ర్యాన్ గోస్లింగ్ లుక్కును కాస్ట్యూమ్స్ తోసహా కాపీ కొట్టాడంటూ దర్శకుడు సుజిత్ పై కామెంట్లు చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే 100 కోట్లకు పై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles