Mehrene Kaur clarity on Fake News | మై డియర్ ఫ్యాన్స్.. ఆ వదంతులు అస్సలు నమ్మొద్దు.. ఫేక్ న్యూస్ పై మెహ్రీన్ క్లారిటీ

Mehrene on upcoming movies

Maherene Kaur, Maherene Kaur Fake News, Maherene Kaur Tweet, Maherene Kaur Twitter, Maherene Kaur Upcoming Movies, Maherene Kaur Gossips, Maherene Kaur Movies

Maherene Kaur Clear airs on Upcoming Movies. She tweeted as Don't believe fake news.

కొత్త సినిమాల విషయంలో మెహ్రీన్ క్లారిటీ

Posted: 10/21/2017 04:12 PM IST
Mehrene on upcoming movies

ప్రస్తుతం టాలీవుడ్ లో మెహ్రీన్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో హిట్ ను తన ఖాతాలో వేసుకోగా.. అందులో నటన కూడా అమ్మడి పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరుస పెట్టి చిత్రాలు యాక్ట్ చేస్తోంది. కేరాఫ్ సూర్య, జవాన్ చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

అయితే రాజా ది గ్రేట్ తర్వాత ఎన్టీఆర్ అప్ కమింగ్ చిత్రంతోపాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు మెహ్రీన్ ఫర్జాదా సైన్ చేసిందంటూ ఈ మధ్య వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆమె తన ట్విట్టర్ లో స్పందించింది. ఇక పై తాను మంచి సినిమాల్లో న‌టించాల‌నుకుంటున్నాన‌ని, అందుకోసం కొంత‌ స‌మ‌యం తీసుకుంటున్నాన‌ని తెలిపింది. తాను ఇప్ప‌టివ‌ర‌కు ఏ కొత్త ప్రాజెక్ట్‌కి ఒప్పుకోలేద‌ని పేర్కొంది. ఈ విష‌యంలో వ‌స్తోన్న ఫేక్ న్యూస్‌ని న‌మ్మ‌కూడ‌ద‌ని తెలిపింది.

ఒక వేళ తాను కొత్త ప్రాజెక్టుకి సైన్ చేస్తే ఆ విష‌యాన్ని అభిమానులకు తానే మొద‌ట తెలుపుతాన‌ని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ... ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles