Pawan action mode for 25th Movie | పవన్ యాక్షన్ మోడ్.. చేతికి గాయమైనా తగ్గట్లేదంట!

Pawan in action mode

Pawan Kalyan, 25th Movie, Chik Mangalore, Pawan Kalyan Trivikram Movie, Pawan 25th Movie, Pawan Action Mode

Pawan Kalyan 25th Movie New Updates. Presently The Movie Unit Compose Fights in Chik Mangalore. Pawan injured while action scenes.

యాక్షన్ మోడ్ లోకి పవన్

Posted: 10/21/2017 03:19 PM IST
Pawan in action mode

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి టైటిల్ పరిశీలనలో ఉండగా.. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ కర్ణాటకలో జరుగుతోంది. చిక్ మంగుళూరు ప్రాంతంలో సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే యాక్షన్ సీన్ ను పవన్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఈ ఫైట్స్ ను త్రివిక్రమ్ డిజైన్ చేయించినట్టు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చేస్తుండగా పవన్ చేతికి గాయమైనా ఆయన లెక్కచేయకుండగా షూటింగులో పాల్గొంటున్నాడని అంటున్నారు. ఇది పవన్ కి 25వ సినిమా .. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో రానున్న మూడవ సినిమా. అందువలన త్రివిక్రమ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడని చెబుతున్నారు.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను విదేశాలలో ప్లాన్ చేశారు. పాటకో దేశం చొప్పున నాలుగు పాటలను చిత్రీకరణ చేయబోతున్నారంట. కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles