Multiplex Theaters Charge Hiked after GST | మల్టీపెక్స్ లో ఛార్జీలు పెరిగాయ్... 150 కాదు 204...

Multiplex rates hiked

Multiplex, Multiplex Theaters Charge, GST Theaters Charges,

Multiplex Theaters Charge Hiked after GST. 150 Rupees Price to 204.

మల్టీ ఫ్లెక్స్ రేట్లు పెరిగాయ్

Posted: 10/18/2017 02:57 PM IST
Multiplex rates hiked

కేంద్ర ప్రభుత్వం సినిమా ధియేటర్ల టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 100 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 28 శాతం జీఎస్టీ పన్ను వసూలు చేయనుండగా, అంతకంటే తక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 18 శాతం జీఎస్టీని విధిస్తున్నట్టు తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 8 శాతం వినోదపు పన్నును కూడా వసూలు చేయనుంది. అంటే ఒక్కోటికెట్ పై మూడు ట్యాక్సులు పడడనున్నాయి.

గతంలో టికెట్ ధర 120 రూపాయలు ఉండేది. దీంతో ట్యాక్సులతో 150 రూపాయలకు లభ్యమయ్యేది. అలాగే గతంలో కనిష్ఠ ధరగా 50 రూపాయల ఉన్న టికెట్ జీఎస్టీ, వినోదపు పన్నులతో కలిపి 63 రూపాయలకు చేరింది. ఏసీ థియేటర్లలో గరిష్ఠ టిక్కెట్‌ ధర 126 రూపాయలకు చేరగా, కనిష్ఠ టిక్కెట్‌ ధర 50.40 రూపాయలుగా ఉంది. నాన్‌ ఏసీ థియేటర్లలో గరిష్ఠ టికెట్ ధర 100.80 రూపాయలకు పెరగగా, కనిష్ఠ టికెట్ ధర 37.80 రూపాయలుగా నిర్ణయించారు.

దీంతో థియేటర్లలో టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. అంటే మల్టీఫ్లెక్స్‌ థియేటర్ లలో గరిష్ఠంగా టిక్కెట్‌ ధర 150 రూపాయలుగా నిర్ణయించింది. దీంతో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీలు, వినోదపన్ను కలుపుకుని 204 రూపాయలకు చేరింది. ఇంతకంటే అధిక ధరలు వసూలుచేసే థియేటర్లపై కఠినచర్యలుంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles