Karthi Khaki Trailer Out and Its Review | కార్తీ ఖాకీ ట్రైలర్.. యాక్షన్ మధ్యలో రకుల్ తో రొమాన్స్

Karthi trailer out

Hero Karthi, Karthi Khaki Trailer, Khaki Trailer Review, Khaki Trailer, Rakul in Khaki Trailer, Karthi Cop Drama Trailer

Hero Karthi New Movie Khaki Trailer Released. Action Cop Drama may release soon. Rakul Lead and Vinod direct the Movie.

కార్తీ ఖాకీ ట్రైలర్ రిలీజ్

Posted: 10/17/2017 06:53 PM IST
Karthi trailer out

కార్తీ మాస్ ప్రయోగాలు ఈ మధ్య వరుసగా బోల్తా పడుతున్నాయ్. ఈ నేపథ్యంలో 'ధీరమ్ అధిగారం ఒండ్రు' అంటూ సీరియస్ కాప్ సబ్జెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు. తెలుగులో ఈ చిత్రం 'ఖాకీ' పేరుతో రాబోతుంది కూడా. ఇప్పటి్కే టీజర్ రిలీజ్ కాగా కాసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ కథానాయికగా నటించింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయనున్నారు. లవ్ .. యాక్షన్ దృశ్యాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ .. ఛేజింగ్ దృశ్యాలలో కార్తీ దుమ్మురేపేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

 

1995 - 2005 మధ్య కాలంలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో.. టోటల్ రియల్ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో కార్తీ వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles