Babu Photo in RGV's Lakshmi's NTR Poster | బాబు ఫోటోతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫోటో.. చిత్రంలో క్యారెక్టర్ ఉంటుందా?

Cbn poster in lakshmi s ntr

Director Ram Gopal Varma, Lakshmi's NTR Movie, Lakshmi's NTR Movie Character, Lakshmi's NTR Movie, Chandrababu Naidu Lakshmi's NTR Movie

Director Varma Posted photos of CBN in Lakshmi's NTR Movie. Even Though an Made those are viral in Internet.

లక్ష్మీస్ ఎన్టీఆర్ పోస్టర్ లో చంద్రబాబు

Posted: 10/17/2017 05:50 PM IST
Cbn poster in lakshmi s ntr

వర్మ ఇంకా సినిమా మొదలుపెట్టకముందే వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఈ అనుమానాల నడుమ అసలు సినిమా షూటింగ్ జరిగినా.. రిలీజ్ మాత్రం డౌటేనని అంటున్నారు. అయినా సరే తన సినిమాతో వాళ్ల నోళ్లు మూయిస్తానని అంటున్నాడు. ఇక ఎన్టీఆర్ ఆత్మ నిత్యమూ కలలోకి వస్తోందని, స్క్రిప్ట్ సహకారం కూడా ఆయనదేన‌ని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఉద‌యం ఆసక్తికర కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే.

సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ కొద్ది సేప‌టి క్రితం ఎన్టీఆర్‌, లక్ష్మిపార్వ‌తికి సంబంధించిన నిజ జీవిత ఫొటోల‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అందులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. వ‌ర్మ పోస్ట్ చేసిన ఓ ఫొటోలో ల‌క్ష్మిపార్వ‌తి మెడ‌లో ఓన్టీఆర్ పూల దండ వేస్తుండ‌గా, వారిద్ద‌రినీ చూస్తూ చంద్ర‌బాబు నిల‌బ‌డ్డారు.

మ‌రో ఫొటో ఎన్టీఆర్ క‌న్నుమూసినన‌ప్ప‌టిది. అందులోనే చంద్ర‌బాబు కూడా ఉన్నారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ అంటూనే వర్మ రిలీజ్ చేసిన ఆ పోస్టర్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయ్. మరి సినిమాలో ఆ క్యారెక్టర్ ఉంటుందా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles