Balayya will Launch Rajashekar's Garuda Vega Trailer | వావ్... బాలయ్య చేతుల మీదుగా ఆ చిత్ర ట్రైలర్ లాంఛ్

Garuda vega trailer launch by senior hero

Nandamuri Balakrishna, Garuda Vega Movie, Garuda Vega Movie Trailer, Garuda Vega Trailer, Balayya Garuda Vega Trailer, Garuda Vega Trailer Balayya, Garuda Vega Release Date

Nandamuri Balakrishna will Launche Rajashekar's Garuda Vega Movie Trailer. Garuda Vega release on November 3rd.

బాలయ్య చేతుల మీదుగా గరుడవేగ ట్రైలర్

Posted: 10/16/2017 10:40 AM IST
Garuda vega trailer launch by senior hero

సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ వేగ'. హైటెక్నికల్ వాల్యూస్ అండ్ దాదాపు పూర్తిగా విదేశాల్లోనే తెరకెక్కిందీ చిత్రం. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ కాగా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో రేపు అంటే అక్టోబర్ 17 మంగళవారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో తెలియజేసింది. బాలయ్య చేతుల మీదుగా లాంఛ్ జరిగితే చిత్రానికి మరింత క్రేజ్ పెరుగుతుందనే నమ్మకంతో వున్నారు. తమ ఫ్యామిలీ హీరోలు.. బాగా దగ్గరైన వారి చిత్రాలకు తప్ప బాలయ్య వేరే వారి సినిమాల విషయంలో అస్సలు జోక్యం చేసుకోడు. అలాంటిది గరుడ వేగ ట్రైలర్ లాంఛ్ చేయటం ఆసక్తికరం.

 

రాజశేఖర్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పూజా కుమార్ కథానాయికగా నటించగా, శ్రద్ధా దాస్, కిషోర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డియో డియో అంటూ సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ చేసింది. వచ్చే నెల 3న సినిమా పెద్ద ఎత్తున్న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles