Aishwarya Rai dragged into Harvey Weinstein scandal | కామాంధుడి బారి నుంచి ఐష్ ను కాపాడిందంట

Aishwarya rai also in harvey weinstein list

Aishwarya Rai, Manager Simone Sheffield, Harvey Weinstein, Harvey Weinstein Aishwarya Rai, Harvey Weinstein Scandal, Harvey Weinstein Controversy

Aishwarya Rai's Manager Simone Sheffield Claims Harvey Weinstein Wanted To Meet The Actress 'Alone'. If a report on a popular Hollywood website is anything to go by, Harvey was also keen on meeting Aishwarya Rai Bachchan alone.

హర్వే స్కాండల్ లోకి ఐష్ పేరు...

Posted: 10/13/2017 06:52 PM IST
Aishwarya rai also in harvey weinstein list

హాలీవుడ్‌లో నిర్మాత హార్వే వెయిన్ స్టెయిన్ లైంగిక వేధింపుల వ్యవహారం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రోజుకో స్టార్ నటి హర్వే లైంగిక దాడులకు యత్నించాడంటూ ఘోరమైన విషయాలను వెలువరిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ వంతు కూడా వచ్చింది. అయితే ఐశ్వ‌ర్య‌రాయ్‌ను తాను కాపాడానంటూ ఆమె మాజీ టాలెంట్ మేనేజ‌ర్ సిమోనె షెఫీల్డ్ పేర్కొంది.

హాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్ వెరైటీ.కామ్ వారు నిర్మాత వ్య‌వ‌హారం గురించి రాసిన క‌థాంశం మీద‌ కామెంట్ చేస్తూ ఆమె ఈ విష‌యం వెల్ల‌డించింది. ఐశ్వ‌ర్య‌తో ఒంట‌రిగా స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని ఆమెను హార్వీ చాలా సార్లు వేడుకున్న‌ట్లు తెలిపింది. అందుకు ఆమె స‌సేమిరా అన్న‌ట్లు తెలియ‌జేసింది.`గతంలో భార‌తీయ న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్ విష‌యాలు నేను చూసుకునేదాన్ని. ఆ స‌మ‌యంలో ఐశ్వ‌ర్య‌ను ఒంట‌రిగా క‌ల‌వ‌డానికి హార్వీ తీవ్రంగా ప్రయ‌త్నించేవాడు. మేం ముగ్గురం మాట్లాడుతున్న‌పుడు న‌న్ను అక్క‌డి నుంచి వెళ్లిపోమ‌నేవాడు. ఒక‌రోజు ఎలాగైనా ఐష్‌తో ఒంట‌రిగా స‌మావేశం ఏర్పాటు చేయ‌మ‌ని, అందుకు తానేం చేయాలో చెప్ప‌మ‌ని న‌న్ను వేడుకున్నాడు. దానికి నేను చెప్పుతో కొట్టిన‌ట్లు స‌మాధానం చెప్పాను. తర్వాత నేను వాడికి కోక్‌తో నింపిన‌ పంది బొమ్మ‌ను బ‌హుమ‌తిగా పంపించా. అందుకు న‌న్ను చాలా సార్లు బెదిరించాడు. అయిన‌ప్ప‌టికీ నా క్లెయింట్ల మీద వాడి నీడ ప‌డ‌నీయ‌లేదు` అని సిమోనె షెఫీల్డ్ వెల్ల‌డించింది.

హార్వీకి వ్య‌తిరేకంగా ఒక్కో హీరోయిన్ తమకు జరిగిన అన్యాయాన్ని బ‌య‌ట పెట్టడాన్ని సిమోనె మెచ్చుకుంది. `క‌లిసి పోరాడితే విజ‌యం దొరుకుతుందంటారు. అలా పోరాడాలంటే ఒక్క‌రు గొంతు విప్పాలి. అలా విప్పిన వారికి అండ‌గా మిగ‌తా వారు ఉంటారు. నిజాన్ని దాచ‌కండి. సోష‌ల్ మీడియా మాధ్య‌మంగా మీ గొంతు క‌ల‌పండి` అని ఆమె పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles