Rajamouli Confirmed Movie With Mahesh Babu | టాలీవుడ్ లో మరో సెన్సేషన్.. మహేష్ తో మూవీ ప్రకటించిన జక్కన్న

Rajamouli confirm movie with mahesh babu

Baahubali Director SS Rajamouli, Rajamouli Mahesh babu, Mahesh Babu Rajamouli, Rajamouli Next Movies, Rajamouli Interview, Baahubali Director Mahesh Babu, Rajamouli Super Star

Baahubali director SS Rajamouli's next to be social drama. SS Rajamouli is teaming up with superstar Mahesh Babu for a Telugu film, which will be bankrolled by KL Narayanan of Kshana Kshana fame. The project is expected to go in the floors in 2019.

రాజమౌళి-మహేష్ బాబు చిత్రం కన్ఫర్మ్!

Posted: 10/13/2017 04:51 PM IST
Rajamouli confirm movie with mahesh babu

ఎట్టకేలకు దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాతి చిత్రాలపై క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్నేషనల్ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా చిత్రం ఉందని క్లారిటీ ఇచ్చేశాడు. స్థానిక మీడియాల్లో ఇప్పుడు ఈ వార్త సెన్సేషన్ గా మారింది.

ఇక తన తదుపరి చిత్రం సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందని అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా, ఓ స్టార్ హీరోతో వుంటుందని.. అది ఎవరన్నది వచ్చే ఏడాదే తెలుస్తుందని చెప్పాడు. ఇక వచ్చే ఏడాది కె.ఎల్. నారాయణ నిర్మాణంలో మహేశ్ బాబుతో ఓ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ లోగా మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి సినిమాను పూర్తి చేసేస్తాడన్న మాట.

ఓటమెరుగని రాజమౌళితో మహేష్ బాబు చిత్రం అనే సరికి అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తర్వాతి చిత్రం 2018లో మొదలై యేడాది లోపే పూర్తి చేయాలని భావిస్తుండగా.. మహేష్ తో ప్రాజెక్ట్ మాత్రం 2019లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మహేష్ కొరటాల, వంశీ పైడిపల్లి చిత్రాల తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో నటించనున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles