Pawan Kalyan’s next film may get emojis | సల్మాన్.. విజయ్ చిత్రాలకు చేసినట్లే పీకే 25కి కూడా...

Emojis for pawan new movie

Pawan Kalyan, Agnathavasi Movie,Emojis, Pawan 25th Movie, Pawan Kalyan Emojis, Pawan Rajinikanth Emojis

awan Kalyan’s next yet-untitled film is planning to have emoji for promotional activities. Makers already booked emojis in twitter. in past Salman Khan for Tubelight and Vijay for Mersal did the same.

పవన్ చిత్రం కోసం ఎమోజీలు

Posted: 10/12/2017 03:31 PM IST
Emojis for pawan new movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరపుకుంటోంది. ఎప్పుడు ఎలాంటి రాజకీయ కమిట్ మెంట్లు తగులుతాయోనన్న టెన్షన్ తో పవన్ కూడా జెట్ స్పీడ్ తో షూటింగ్ జరిగిపోయేందు సహకరిస్తున్నాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవటమే ఇందుకు కారణం.

ఇక సినిమా పేరు అజ్ఞాతవాసి అని ఇప్పటివరకూ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. కానీ, నిర్మాతలు టైటిల్ ను రిజిస్ట్రర్ చేసినట్లు చెబుతుండటంతో దాదాపుగా ఇదే పేరు ఖాయం అయిపోయినట్లే. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పవర్ స్టార్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ నిర్మాతలు అన్ని రూట్లు వాడుకోవాలని యత్నిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను అస్సలు వదలకూడదని డిసైడ్ అయ్యారు.

అన్ని రకాల ఆప్షన్స్ ఉపయోగిస్తూ... హైప్ విపరీతంగా పెంచేందుకు ట్రై చేస్తున్నారు. చిత్రం కోసం ఓ ట్విట్టర్ ఎమోజిని కూడా నిర్మాతలు బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ హీరో విజయ్ నటించి మెర్సల్(తెలుగులో అదిరింది) చిత్రం.. ఇలా ట్విట్టర్ ఎమోజీ లాంఛ్ చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ మూవీ రికార్డుల లిస్ట్ లో ఉంది. అసలు అంతకు ముందే ట్యూబ్ లైట్ తో సల్మాన్ ఆ ట్రెండ్ ను మొదలుపెట్టాడు. ఇప్పుడు అజ్ఞాతవాసి ద్వారా ట్విట్టర్ ఎమోజి ప్రమోషన్ ను కూడా టాలీవుడ్ స్టార్ట్ చేసినట్లయ్యింది.

పవన్ కళ్యాణ్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ ఈ చిత్రంలో నటిస్తుండగా, ఖుష్బూ ఓ కీ రోల్ లో కనిపించబోతుంది. జనవరి 10న పవన్ 25వ చిత్రం రిలీజ్ అవుతుందని ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Emojis  పవన్ కళ్యాణ్  ఎమోజీలు  

Other Articles