Dil Raju Pre Pone Plans about Nani's MCA Movie | పోటీ వద్దనుకునే రిలీజ్ ను మార్చేస్తున్నాడు

Nag requested dil raju

Dil Raju, Nani MCA Movie, Nagarjuna Dil Raju Hello Movie, MCA Movie Release Date, Nagarjuna Akkineni Nani, Nagarjuna Akkineni Dil Raju MCA Movie, MCA Hello Movies

Nani' MCA Movie preponed? Nag requested if Dil Raju can pre-pone his film by a week. Raju was quite comfortable and pre-poned the release of MCA by a week to avoid clash.

నాని ఎంసీఏ రిలీజ్ ప్రీ పోన్?

Posted: 10/11/2017 11:45 AM IST
Nag requested dil raju

ఈ యేడాది అసలైన సక్సెస్ టేస్ట్ ను రుచి చూసింది ఎవరంటే నిర్మాత దిల్ రాజు అనే చెప్పాలి. శతమానం భవతి.. నేను లోకల్.. డీజే ఇలా నిర్మాతగానే కాదు.. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా కూడా భారీగానే ఆదాయం ఆయన వెనకేసుకున్నారు. త్వరలో రవితేజ రాజా ది గ్రేట్ తో మరోసారి ముందుకు రానున్నాడు.

ఇదిలా ఉంటే నానితో ప్రస్తుతం ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ యేడాది చివర్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని అనౌన్స్ కూడా చేశాడు. అయితే అఖిల్ రెండో చిత్రం హలో కూడా అదే టైంకి రిలీజ్ అవుతుందని నాగ్ కూడా ప్రకటించటంతో పోటీ తప్పదనే అంతా అనుకున్నారు. కానీ, దిల్ రాజు ఇప్పుడు తన మనసును మార్చేసుకున్నాడని టాక్.

అఖిల్ కెరీర్ కు కీలకం కావటం. పైగా భారీ బడ్జెట్ తో తీస్తుండటంతో నాగ్ దిల్ రాజును రిక్వెస్ట్ చేశాడటం. దీనికి తోడు  షూటింగ్ చాలా వేగంగా జరుగుతుండటంతో ముందుగానే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడంట. రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హలో విషయంలో నాగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles