Varma Comments on Pawan New Born Baby Photo | పవన్ ఫోటోపై వర్మ ఏమన్నాడో తెలుసా?

Rgv positive tweets on power star

Ram Gopal Varma, Pawan Kalyan, Pawan kalyan New Born Baby, RGV Pawan Kalyan, Pawan New Born Baby RGV Tweets

Ram Gopal Varma Positive Comments on Power Star Pawan Kalyan. Varma Comments on Pawan New Born Baby Photo.

పవన్ పై వర్మ పాజిటివ్ మెసేజ్ లు

Posted: 10/10/2017 05:34 PM IST
Rgv positive tweets on power star

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్, లెజ్నోవా దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అప్పడే పుట్టిన తన కుమారుడిని చూసుకుని పవన్ మురిసిపోతూ దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాకు చేరి వైరల్ కూడా అయింది.

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ కు కొడుకు పుట్టడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన కుమారుడిని ఒళ్లో పడుకోబెట్టుకుని తనివితీరా చూస్తున్న పవన్ ఫొటోను పోస్ట్ చేసిన వర్మ, ‘ఊహకు అందనంత అందంగా వున్న కొడుకును తనివితీరా చూస్తున్న తండ్రి..’ అని పేర్కొన్నారు.

అంతకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాసిన బహిరంగ లేఖను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ పోస్ట్ చేశారు. పవన్ పుస్తకం 'ఇజం' గురించి వర్మ రాసిన ఓ లేఖ హైదరాబాద్ టైమ్స్ లో ప్రచురితమైంది. దాన్ని ఇప్పుడు తన ఫేస్ బుక్ పేజ్ లో వర్మ పోస్ట్ చేశారు. పవనిజం పై తనకు ఇప్పటికీ నమ్మకం ఉందని ఆయన అందులో చెప్పారు. ఇప్పుడు కావాల్సింది 100 శాతం పవనిజం మాత్రమే. మీ తొలి ప్రసంగంలో మీరు చెప్పిన లక్ష్యాలను తాకే విధంగా ఇజం పుస్తకంలో 90 శాతం లేదు.పవన్ లో బ్రూస్ లీ తరహాలోనే తీవ్రత, చిత్తశుద్ధి ఉన్నాయని.. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే వ్యక్తపరుస్తున్నారో... అదే మీ సొంత ఫిలాసఫీగా ఉండాలి. మిమ్మల్ని ఆరాధించే వ్యక్తిగా, మీ శ్రేయోభిలాషిగా మీకు ఇదంతా చెబుతున్నా అంటూ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles