Venky Nag Dance at Naga Chaitanya Samantha Wedding / సామ్-చైతూ పెళ్లిలో వెంకీ-నాగ్ చిందులు

Nag reveals happy moments with chaitu and venky

Nagarjuna Akkineni, Samantha Naga Chaitanya Wedding, Nagarjuna Venkatesh Naga Chaitanya, Nag Happy Moments with Chai and Venky, Nag Venky Chai Dance, Chai Sam Wedding Highlights

Nagarjuna Akkineni Shares Dance Photos Along with Venkatest and Bridegroom Naga Chaitanya in Twitter. Nag Happiness with Venky and Chai goes viral.

నాగ చైతన్య పెళ్లిలో స్టెప్పులేసిన నాగ్-వెంకీ

Posted: 10/07/2017 05:01 PM IST
Nag reveals happy moments with chaitu and venky

హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం సినీనటులు నాగ‌చైత‌న్య‌, స‌మంత వివాహం నిన్న రాత్రి గోవాలో జ‌రిగిన విష‌యం తెలిసిందే. నేడు క్రిస్టియన్ సాంప్రదాయంలో జరగబోతుంది. అయితే వీళ్ల పెళ్లి హడావుడి ఫోటోలు మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. సంగీత్ లో సురేష్ బాబుతో సమంత స్టెప్పులేయటం దగ్గరి నుంచి చైతూను వెంకీ పెళ్లి కొడుకు చేసే దాకా ఇలా అన్నీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి.

దీనికి తోడు పెళ్లి కూతురు సమంత స్వయంగా తన ట్విట్టర్ లో రియాక్ట్ అవుతుండటం.. అదే సమయంలో పెళ్లి కొడుకు తండ్రి అదేనండీ కింగ్ నాగార్జున కూడా జంట ఫోటోలను సోషల్ మీడియలో అప్ లోడ్ చేస్తున్నాడు. వేడుకల్లో స‌మంతనే కాకుండా పెళ్లి కొడుకు నాగ‌చైత‌న్య కూడా బాగానే అల్ల‌రి చేశాడు. కానీ, అవి అంత‌గా సోష‌ల్ మీడియాలోకి ఎక్క‌కపోవటంతో స్వయంగా నాగ్ రంగంలోకి దిగాడు.

వెంక‌టేశ్‌, నాగార్జున‌తో క‌లిసి నాగ‌చైత‌న్య స్టెప్పులు వేస్తుండ‌గా తీసిన ఫొటోల‌ను నాగార్జున తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నిన్న రాత్రి నాగ‌చైత‌న్య హుషారుగా త‌మ‌తో క‌లిసి ఇలా డ్యాన్సు చేశాడ‌ని నాగ్ తెలిపారు. హ్యాపీనెస్ విత్ వెంకీ, చై అంటూ పేర్కొన్నాడు. నాగ చైతన్య మేనమామ అయిన వెంకీ కూడా పంచె కట్టులో స్టెప్పులతో అదరగొట్టాడనే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆ జంటకు ప్రముఖుల విషెష్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles