No Robotic Spyder in Spyder Movie | స్పైడర్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన మహేష్

Mahesh about spyder experience

Mahesh Babu, Spyder Movie, Spyder Teaser, No Spyder in SPYder Movie, Mahesh Movie Robo Spyder, Spyder Teaser spyder no in Movie

Mahesh Babu Shares Interesting Things about SPYder Movie. There is no robotic spyder in movie mahesh clarified.

స్పైడర్ ఎంతో అనుభవమిచ్చింది : మహేష్

Posted: 09/26/2017 05:43 PM IST
Mahesh about spyder experience

'స్పైడర్'లో నటించడం తనకెంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, వేర్వేరు నటులతో తెలుగు, తమిళ భాషల్లో చిత్రం ఒకేసారి చిత్రీకరించడం వల్ల, తాను గంటల వ్యవధిలో తెలుగు, తమిళం మాట్లాడుతూ ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. 'స్పైడర్' రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న నేపథ్యంలో మహేష్ చివరి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు.

ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఇక చిత్రం టీజర్ గ్లింప్స్ మీకు గుర్తుందా? మహేష్ బాబు సీరియస్ గా తన పని చేసుకుంటుంటే.. ఓ రోబో స్పైడర్ మెల్లగా ఆయన కాలు పట్టుకుని పైకి ఎక్కి, భుజంపై చేరి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మహేష్ దాన్ని 'ష్...' అని హెచ్చరిస్తే, తోక ముడుచుకుని కూర్చుంటుంది. దీని కోసం లండన్ టెక్నీషియన్లతో ఎంతో ఖర్చు చేసి టీజర్ ను సిద్ధం చేశాడు మురగదాస్. ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు.

అయితే, సినిమాలో ఈ 'స్పైడర్' కనిపించదట. ఈ విషయాన్ని మహేష్ బాబే స్వయంగా చెప్పటంతో అభిమానులకు కొంత నిరాశ కలిగించాడు. సినిమా కాన్సెప్ట్ ను చూపించేందుకే ఆ టీజర్ ను షూట్ చేశామని చెప్పాడు. చిత్రంలో తాను ఐబీ అధికారిగా పనిచేశానని చెప్పాడు. ఈ చిత్రంలో తాను డబుల్ యాక్షన్ చేశానని వచ్చిన వార్తలు అవాస్తవమని, అటువంటిది ఉంటే ట్రయిలర్ లో చూపించే వాళ్లమని చెప్పాడు. ప్రస్తుతం సినిమా సక్సెస్ తన కన్నా నిర్మాతలకే ఎంతో ముఖ్యమన్న మహేష్.. చిత్ర ఘన విజయ సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles