Ilayaraja Notices to Music App to Use his Songs | రాజావారి పాటలు ఎవరూ వాడుకోవద్దంట !

After sp balu now music app trouble with ilayaraja

Ilayaraja, Legal Notices, S. P. Balasubrahmanyam, Karaoke app-based Smule, SP Balasubrahmanyam, Ilayaraja Copy Rights Issue

After sending a legal notice to SP Balasubrahmanyam for not seeking permission to use his songs, Ilayaraja has now sent an e-mail to a Karaoke app-based Smule to remove his songs from the company's database.

మ్యూజిక్ యాప్ కు ఇళయరాజా నోటీసులు

Posted: 09/26/2017 04:31 PM IST
After sp balu now music app trouble with ilayaraja

కొంత కాలం క్రితం మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య రాజా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన పాటలను కచేరీలో పాడుతున్న బాలుకు షాకిస్తూ.. ఇక ముందెక్కడా పాడకుండా చర్యలు తీసుకునేలా చేశాడు. రాజా చేసిన పనికి గానగంధర్వుడు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

అయితే ఇప్పుడు మరోసారి ఇళయ రాజా ఇలాంటి పనే చేశాడు. వ‌ర్ధ‌మాన గాయ‌నీ గాయ‌కులకు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతున్న స్మ్యూల్ మ్యూజిక్ యాప్‌కి మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య రాజా కాపీరైట్ ఉల్లంఘ‌న నోటీసులు పంపించారు. ఇళ‌య‌రాజా పాట‌ల‌ను కేరియోకో ఫార్మాట్‌లో అంద‌జేసే స్మ్యూల్ యాప్ వెంట‌నే త‌మ పాట‌ల‌ను డేటాబేస్ నుంచి తొల‌గించాల‌ని ఇళ‌య‌రాజా కాపీరైట్ క‌న్స‌ల్టెంట్ ప్ర‌దీప్ కుమార్ తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడి అనుమ‌తి లేకుండానే ఆయ‌న పాట‌ల మీద ఆ యాప్ సొమ్ము చేసుకుంటోంద‌ని ఆయన ఆరోపించారు. అయితే స్మ్యూల్ యాప్ విష‌యంలో కూడా ఇళ‌య‌రాజా ఇలా చేయడంపై వ‌ర్ధ‌మాన గాయ‌నీగాయ‌కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త‌మ టాలెంట్‌ను నిరూపించుకునే అవ‌కాశం లేకుండా చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles