SPYder Overseas Huge Release will Relief to Makers | స్పైడర్ ఓవర్సీస్ రిలీజ్.. వర్కవుట్ అవుతేనే అంతా సేఫ్

Spyder eyed on overseas collections

Mahesh Babu, SPYder Movie, Overseas Release, SPYder Premier Shows, Spyder Pre Release market

Mahesh Babu Spyder Movie Huge Release in Overseas especially in America. If Movie Collects Million Club with Premier Shows benefit to Makers.

స్పైడర్ ఓవర్సీస్ మీదే అందరి దృష్టి

Posted: 09/25/2017 06:32 PM IST
Spyder eyed on overseas collections

ఇప్పుడు సౌత్ లో స్పైడర్ మూవీ ఫీవర్ ఉపేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను 'స్పైడర్' భారీ స్థాయిలో విడుదలవుతోంది. అసలే మహేష్ మూవీకి అక్కడ ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఫ్లాపు సినిమాలతో కూడా మంచి కలెక్షన్లు రాబట్టగలిగే సత్తా మహేశ్ కి ఉంది.

ఈ నేపథ్యంలో స్పైడర్ కూడా కొత్త రికార్డ్ క్రియేట్ చేయటం ఖాయమనే చెబుతున్నారు. ఆయన తాజా చిత్రం 'స్పైడర్' ప్రీమియర్ షోల ద్వారానే కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. యూఎస్ లో ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ముందు రోజున ఈ సినిమా ప్రీమియర్ షోలను భారీ స్థాయిలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షోల ద్వారానే మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మొన్న రీలీజ్ అయిన 'జై లవ కుశ' ప్రీమియర్ షోల ద్వారానే హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆ రికార్డును అధిగమిస్తూ ఈ సినిమా మిలియన్ మార్క్ ను చేరుకోవడం ఖాయమని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో ఈ సినిమా 'బాహుబలి' రికార్డును టచ్ చేయవచ్చని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles