RGV Hero Ready to Produce Lakshmi NTR Movie | వీళిద్దరూ కలిసి మరో వివాదం చేస్తారా?

Lakshmi ntr movie producer

Ram Gopal Varma, Lakshmi NTR Movie, JD Chakravarthy, Lakshmi Parvathy Movie, Lakshmi NTR Movie Makers, Lakshmi NTR Movie Producer, RGV JD Lakshmi Parvathy

Actor JD Chakravarthy ready to Produce Ram Gopal Varma's Lakshmi NTR Movie. JD Already Met Lakshmi Parvathy and taken permission from her, But Not OFficially Confirmed Yet.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాతగా జేడీ చక్రవర్తి?

Posted: 09/25/2017 06:02 PM IST
Lakshmi ntr movie producer

దివంగత నటుడు ఎన్టీఆర్ జీవితచరిత్రను తెరకెక్కించనున్నట్టు చెప్పిన రామ్ గోపాల్ వర్మ, తర్వాత మాట మార్చేశాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒత్తిడో లేక మరెయితర కారణమో తెలీదుగానీ ప్రస్తుతం ఆయన వేరే చిత్రానికి ఫ్లాన్ చేశాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో తన సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు.

ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన నేపథ్యం ఈ సినిమాలో కథా వస్తువుగా ఉంటుందని అన్నాడు. లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు? అనే ప్రశ్న అందరిలోను తలెత్తింది. ఇక ఇప్పుడు నిర్మాతగా జేడీ చక్రవర్తి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మతో జేడీ చక్రవర్తికి మంచి సాన్నిహిత్యం వుంది.

ఈ కారణంగా ఈ సినిమాను నిర్మించడానికి ఆయన ముందుకు వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆల్రెడీ ఆయన లక్ష్మీ పార్వతిని కలిసి ఈ విషయంపై చర్చలు జరిపినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో అధికారిక ప్రకటన వెలువడితేనే తెలిసేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles