Sandeep Kishan C/o Surya Movie Teaser Review | సూర్య టీజర్ ను ఎవరూ పట్టించుకోరా?

Sandeep kishan new movie teaser out

Sandeep Kishan, C/o Surya Movie, Sandeep Kishan Teaser, Sandeep Kishan C/o Surya Movie, C/o Surya Movie Review, C/o Surya Movie Director, C/o Surya Movie Actress

Sandeep Kishan New Movie Teaser Released. C/o Surya Movie Teaser Review and Promising.

కేరాఫ్ సూర్య టీజర్ రిలీజ్ అయ్యింది

Posted: 09/25/2017 02:35 PM IST
Sandeep kishan new movie teaser out

టాలీవుడ్ లో గత కొంత కాలంగా హిట్ అనే పదానికి దూరమైపోయాడు యువ హీరో సందీప్ కిషన్. రీసెంట్ గా రిలీజ్ అయిన నక్షత్రం ఏ రేంజ్ డిజాస్టరో తెలియంది కాదు. అందుకే ఈసారి రెగ్యులర్ ఎంటర్ టైనర్ కథనే నమ్ముకున్నాడు. కేరాఫ్ సూర్య పేరుతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

నా పేరు శివ చిత్ర దర్శకుడు సుశీంద్రన్ 'కేరాఫ్ సూర్య' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. యాంకర్ అడిగే ప్రశ్నలకు కమెడియన్ సత్య చెప్పే ఆన్సర్లు చాలా ఫన్నీగా ఉన్నాయి.

 

ఇక చివర్లో కథానాయకుడి పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ ఉంది. తమిళ మ్యూజిక్ డైరక్టర్ ఇమ్మాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. దీపావళికి కేరాఫ్ సూర్య చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. సక్సెస్ లేని సందీప్ కు ఈ తమిళ దర్శకుడు అయినా హిట్ ఇస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles