Actor Siva Balaji wins Bigg Boss Telugu trophy బిగ్ బాస్ విజేత శివబాలాజీ.. షో అధిరిందని వ్యాఖ్య

Actor siva balaji wins bigg boss telugu trophy

bigg boss, bigg boss telugu, bigg boss telugu final, bigg boss telugu finale, bigg boss winner, bigg boss telugu winner, siva balaji, bigg boss siva, siva, big boss, big boss telugu, big boss telugu final, big boss telugu finale, big boss winner, big boss telugu winner, big boss siva, jr ntr, ntr jr, adarsh balakrishna, archana, navdeep, hari teja, jyothi, diksha panth, prince cecil, sameer, sampoornesh babu, kathi karthika, dhanraj, madhu priya, mahesh kathi, kalpana raghavendar, mumaith khan

Siva Balaji, who gained maximum votes from the audience on Sunday evening, emerged as the winner of the first season of Bigg Boss Telugu. He saw off competition from Adarsh Balakrishna, Hari Teja, Archana and Navdeep.

బిగ్ బాస్ విజేత శివబాలాజీ.. షో అధిరిందని వ్యాఖ్య

Posted: 09/25/2017 10:25 AM IST
Actor siva balaji wins bigg boss telugu trophy

జాతీయంగా మంచి క్రేజ్ సంపాదించుకుని.. తొలిసారిగా తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకు వచ్చిన బిగ్ బాస్ రియాలిటో షో విజేతగా సినీనటుడు శివబాలాజీ నిలిచారు. స్టార్‌ మాటీవీ ఆధ్వర్యంలో 70 రోజుల పాటు జరిగిన ఈ రియాలిటీ షోకు యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్ గా నిలిచారు. ఈ షో నిర్వహణపై అదిలో కొంత డివైడ్ టాక్ వచ్చినా.. ఆ తరువాత మంచి తెలుగు రాష్ట్రాల ప్రజలలో మంచి క్రేజ్ సంపాదించింది. చూస్తుండగానే డెబ్బై రోజులు అప్పుడే అయిపోయాయా..? అన్న డౌట్స్ కూడా ప్రేక్షకుల నుంచి రేగాయంటే ఈ షో ఎంతగా అదరణ సంపాదించిందో ఇట్టే అర్థమవుతుంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 రోజుల పాటు ప్రపంచానికి దూరంగా.. కుటుంబాలకు దూరంగా తమ గదిలో వున్న వారితో మాత్రమే సంబాషిస్తూ.. వారే ప్రపంచం.. తమకు కేటాయించి గదులే భూమండలంగా.. ఈ షోలోని పార్టిసిపెంట్లు ఎలా వుంటారన్న కాన్సెప్టు నేపథ్యంలో నిర్వహంచిన రియాలిటీ షో ఇది. దిగ్విజయంగా 70 రోజుల పాటు కోనసాగిన ఈ షో అత్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, 71వ రోజున జరిగిన ఫైనల్ వేడుకలో ‘బిగ్ బాస్’ విజేతను ఎన్టీయార్ ప్రకటించారు.

ఈ షోలో మొత్తం 16 మంది తెలుగు చిత్ర, బుల్లితెర సహా పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు పాల్గోనగా, వారిలో చివరి రోజున కేవలం ఐదుగురు మిగిలారు. ఎవరు విజేతగా నిలుస్తారు అన్న ప్రశ్న అటు పార్టిసిపెంట్లతో పాటు ఇటు ప్రేక్షకులను కూడా తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. అయితే చివరిలో షోలో నిలిచిన పార్టిసిపెంట్లలో అర్చన, నవదీప్‌లు వెనకబడడంతో ఆదివారం తుది పోటీకి ముందే బిగ్‌బాస్‌ ఇంటిని వదిలారు. ఫైనల్లో శివబాలాజీ, ఆదర్శ్‌, హరితేజ మిగిలారు. ఈ షో మొత్తంలో దాదాపు 11 కోట్ల మంది ప్రేక్షకులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా 3 కోట్లకు పైగా ఓట్లు సాధించిన శివబాలాజీని ఎన్టీఆర్‌ విజేతగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రోఫీతోపాటు రూ.50 లక్షల నగదు అందజేశారు. ఫైనల్ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ చేసిన నృత్యం ప్రేక్షకులను అలరించింది.

షో అదుర్స్: బిగ్ బాస్ విజేత శివబాలాజీ

‘బిగ్ బాస్’ షో అదిరిపోయిందని విజేత శివబాలాజీ అన్నారు. తాను తెలుగు బిగ్ బాస్ షో విజేతగా నిలవడం ఎంతో అనందాన్నిచ్చిందన్నాడు. తాను విజేతగా నిలుస్తానని అనుకోలేదని.. తాను పలువురు సెలబ్రిటీల మాదిరిగా ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని తనకు తాను భావించానని అయితే తానే విజేతగా నిలవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచి వ్యక్తులని చెప్పిన బాలాజీ వారితోనే ఈ షో ప్రశాంతంగగా సాగిందని అన్నారు.

తాను సాధించిన ఈ విజయంలో తనతో పాటు ఈ షోలో పాల్గోన్న వారందరి పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా ఇది బిగ్ బాస్ 1 కుటుంబం మాదిరిగా అందరం చాలా సన్నిహితులుగా మారామని అన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా తమను ఇంతగా అదరిస్తారని తాను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ‘లవ్ యూ’ అని ఎవరికి చెబుతారు? అని శివ బాలాజీని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించగా, ‘హండ్రెట్ పర్సెంట్ మధుకే’ అంటూ తన భార్య పేరును శివబాలాజీ చెప్పడంతో కరతాళధ్వనులు మారుమోగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bigg boss  telugu finale  season 1  grane finale winner  junior ntr  entertainment  

Other Articles