hey pillagaada song from fidaa movie goes viral విడుదలైన చిత్రంలోని ఆ పాట నెట్టింటో వైరల్

Hey pillagaada song from fidaa movie goes viral on social media

fidaa, fidaa telugu movie, fidaa Varun Tej, Sai Pallavi, fidaa Varun Tej dai pallavi, fidaa hey pillagaada full song, Shakthikanth Karthick, fidaa Director, fidaa movie director Shekar Kammula, viral video, video viral, tollywood,

Hey Pillagaada Full Video Song From Fidaa Movie is viral on social network sites, which reached 6 lakh viewers in 24 hours.

విడుదలైన చిత్రంలోని ఆ పాట నెట్టింటో వైరల్

Posted: 09/23/2017 02:16 PM IST
Hey pillagaada song from fidaa movie goes viral on social media

తెలంగాణ యాసకు ఆంద్ర బాషకు ముడిపెడుతూ.. అమెరికాలో స్థిరపడిన అబ్బాయికి.. తమ పల్లెటూర్లోనే స్థిరపడి తండ్రిని కూడా నిత్యం చూసుకోవాలని.. తన వాళ్ల ఎదుటే నిత్యం వుండాలనే ఓ అమ్మాయికి ముడిపెడుతూ సాగిన అచ్చతేట తెలుగు చిత్రం ఫిదా. ‘భానుమతి ఒక్కటే పీస్‌ హైబ్రీడ్‌ పిల్ల’ అంటూ యువకుల గుండెలను పిండేసిన సాయిపల్లవి నటన.. అంతే హుందా అమె ప్రేమను గెలుచుకోవాలని ప్రయత్నించి మోగా హీరో వరుణ్‌తేజ్ మొత్తానికి తెలుగు ప్రేక్షకులను ముగ్దులను చేసింది.

అయితే ఈ చిత్రం ఈ ఏడాది జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోగా, మరీ ముఖ్యంగా సాయిపల్లవి నటనకు తెలుగు ప్రేక్షకులు ‘ఫిదా’ అయిపోయారు. శేఖర్‌కమ్ముల దర్శకత్వం శైలి, శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం, నిర్మాత దిల్‌ రాజునిర్మాణ విలువలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో 2017లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రాల జాబితాలో ‘ఫిదా’ చోటు దక్కించుకుంది.

ఇందులో వనమాలి రాసిన ‘హే పిల్లగాడా’ అంటూ సాగే పూర్తి వీడియో పాటను శుక్ర‌వారం చిత్ర బృందం విడుద‌ల చేసింది. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ కూడా చేసింది. దీంతో ఇప్పుడ‌ా పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన‌ 24గంటలు కూడా పూర్తికాకుండానే ఏకంగా 6లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. కార్తీక్‌ స్వరాలు సమకూర్చగా, సింధూరి, సినోవ్‌ రాజ్‌లు ఆలపించారు. విజయ్‌ సి. కుమార్‌ సినిమాటోగ్రఫీ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hey pillagaada  fidaa  varun tej  sai pallavi  shekar kammula  viral video  video viral  tollywood  

Other Articles