Ramoji Rao Appreciates KCR's Telugu Must Decision | కేసీఆర్ డెసిషన్.. ఆయన నుంచి ఇలాంటి రియాక్షన్ ఎక్స్ పెక్ట్ చేయలేదు...

Ramoji rao letter to kcr

Telangana, CM KCR, KCR Telugu Conference, Ramoji Rao Appreciates KCR, Ramoji Rao Appreciate KCR, Ramoji Rao KCR Chandrababu Naidu

Eenadu Chairman Ramoji Rao appreciated KCR's planning Word Telugu Conference in Hyderabad and also for allocating funds to that. He also praised KCR for making Telugu as a Compulsory subject for students from Class I to XII. He termed this move of KCR as much-needed for the upliftment of the language. He also requested KCR in open letter to test the proficiency in Telugu for all the government job.

కేసీఆర్ నిర్ణయంపై రామోజీ రావు హర్షం

Posted: 09/22/2017 04:23 PM IST
Ramoji rao letter to kcr

మీడియా బెరూన్, రాజ గురు రామోజీ రావు సాధారణంగా బయట ప్రైవేట్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించరు. మాములు నోరు విప్పి మాట్లాడని ఆయన భావాలేంటో ఎవరికీ పెద్దగా అంతుపట్టవు. అలాంటి పెద్దాయన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ను పొగుడుతూ బహిరంగ లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.

త్వరలో తెలుగు మహాసభలను హైదరాబాద్ లో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం నిధులను కూడా రిలీజ్ చేసింది. అంతేకాదు మొదటి తరగతి నుంచి ఫ్లస్ టూ దాకా విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను పొగుడుతూ రామోజీ రావు ఓ లేఖ రాశారు.

అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా తెలుగు భాషను ప్రాముఖ్యతను పెంపొందిచేలా చూడాలని విజ్నప్తి కూడా చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భాషను తప్పనిసరి చేస్తేనే ప్రజలకు సులువుగా చేరుతుందని ఆయన అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే కేసీఆర్ తెలుగు భాష విషయంలో తీసుకున్న చొరవ బావుందన్న రీతిలో మీడియా పెద్దాయన ప్రశంసించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles