Raju Gari Gadhi 2 Theatrical Trailer Released | నాగ్ మెంటలిస్ట్.. శామ్ దెయ్యం... రాజుగారి గది 2 ట్రైలర్ అంతేనా?

Raju gari gadhi 2 theatrical trailer out

Raju Gari Gadhi 2, Akkinerni Nagarjuna, Samantha, Raju Gari Gadhi 2 Trailer, Raju Gari Gadhi 2 Trailer Review, Raju Gari Gadhi 2 Nagarjuna, Nag Raju Gari Gadhi 2 Movie, Raju Gari Gadhi 2 Telugu Movie

Akkineni Nagarjuna Starrer Raju Gari Gadhi 2 Theatrical Trailer Released, Nag essayed as Mentalist Role and Samantha appear in Ghost play.

రాజుగారి గది-2 అఫీషియల్ ట్రైలర్ రిలీజ్

Posted: 09/20/2017 10:34 AM IST
Raju gari gadhi 2 theatrical trailer out

అక్కినేని నాగార్జున కొత్త చిత్రం రాజుగారి గది-2 థియేటరికల్ ట్రయిలర్ విడుదలైంది. దివంగత నటుడు నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను నాగ్ తన ట్విట్టర్ లో విడుదల చేశారు. బీచ్ పక్కన ఇల్లు.. అందులో పగతో రగిలిపోయే ఆడ దెయ్యం.. దానిని వదిలించేందుకు వచ్చే మెంటలిస్ట్ గా నాగ్ కనిపించారు.

కళ్లల్లో చూస్తూ గుండెల్లో ఏమున్నదో చెప్పే మానసిక వైద్యుడిగా కనిపిస్తున్నాడు. ఓ గోడలో నుంచి చెయ్యి వచ్చి మెడ పట్టుకునే దృశ్యాలు, సాధారణ హారర్ సినిమాల్లో కనిపించే శబ్దాలు కూడా ఉన్నాయి. ఇక ఈ దెయ్యం మామూలుది కాదని, ఊరమాస్ దెయ్యమని, పిచ్చెక్కించేస్తోందని వెన్నెల కిశోర్ చెప్పటం, చేతిలో రుద్రాక్ష మాలతో నాగార్జున దాన్ని ఆటాడించే ప్రయత్నం చేయడం తెలుస్తోంది. హీరోయిన్ సీరత్ కపూర్ క్యారెక్టర్ ను పెద్దగా చూపించకపోయినా.. బికినీ ట్రీట్ ఉన్నట్లు వెనకాల నుంచి చూపించేశారు.

ఓ అమ్మాయి ఆత్మ పగతో ఉందని, ప్రతీకారం కోరుతోందని నాగ్ చెప్పడం, సమంత రూపాన్ని చిత్రిస్తే, దానంతట అదే మాయం కావడం శామ్ దెయ్యమన్న విషయం స్పష్టమైపోయింది. ఇక తొలి భాగంలో ఉన్న ఫేమస్ డైలాగ్ 'బొమ్మాళీ నన్ను పెళ్లిచేసుకుంటావా?' అన్న మాటలు ఇందులోనూ ఉన్నాయి. అక్టోబర్ 13న రాజుగారి గది 2 విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles