Vjayawada Police File Case against Director Varma | వర్మను వదలని వంగవీటి.. అరెస్ట్ తప్పదంట!

Police file case against rgv

Director Ram Gopal Varma, RGV Police Case, Varma Vangaveeti, Vangaveeti Movie, Vangaveeti Controversy, RGV New Movie, Vijayawada Police Arrest RGV, RGV Dasari Kirankumar Arrest

Police file case against Director Ram Gopal Varma. The Satyanarayanapuram Police on Tuesday filed a case against film director Ram Gopal Varma and three others under Section 156 Clause (3) based on a directive of the First Metropolitan Court Magistrate.

వంగవీటి వివాదం.. దర్శకుడు వర్మపై పోలీస్ కేసు

Posted: 09/20/2017 08:28 AM IST
Police file case against rgv

వంగవీటి వివాదం దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇప్పట్లో వదిలేలా కనిపించటం లేదు. ఈ వ్యవహారంలో నమోదైన ఓ కేసును విచారించిన విజయవాడ న్యాయస్థానం ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. వర్మతోపాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి, ఆపై అదుపులోకి తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

వర్మ దర్శకత్వంలో కిరణ్ కుమార్ నిర్మాతగా ‘వంగవీటి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ సమయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆ సమయంలో వర్మ తాను తీయదలచుకున్న సినిమాపై వారికి వివరణ కూడా ఇచ్చారు.    వర్మ దమ్ముంటే ఆపు...

అయితే, వర్మ తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా, వాస్తవాలను వక్రీకరించి, ‘వంగవీటి’ సినిమాను తీసి, తమ కుటుంబాన్ని అవమానపరిచారని రంగా తనయుడు రాధా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన ఫస్ట్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి, రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ లపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

 

వివాదం చేసేంత సీన్ లేదా?

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles